ఈ మూడు దేశాల్లో కరోనా దాదాపు కంట్రోల్..

ఈ మూడు దేశాల్లో కరోనా దాదాపు కంట్రోల్..
x
Highlights

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచంలో 190 దేశాలకు పాకింది.

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచంలో 190 దేశాలకు పాకింది. రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. చైనాలో ప్రస్తుతం కేసులు తగ్గుతూనే ఉన్నాయి.. అదేవిధంగా హాంకాంగ్, తైవాన్ దేశాల్లో కూడా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. గతంలో ఈ మూడు దేశాల్లో వందల్లో నమోదైన కేసులు.. ఇప్పుడు సింగల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి.. హాంకాంగ్, తైవాన్‌లో 24 గంటల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. అయితే చైనాలో 24 గంటల్లో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం తెలిపింది. అయితే ఎవరూ చనిపోలేదని అన్నారు. ఈ నాలుగు కేసులు షాంఘై నగరంలో వచ్చాయి.

ఇక దేశంలోని 31 ప్రావిన్సులలో ఇప్పటివరకు 82 వేల 862 సంక్రమణ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4633 మంది మరణించారు. 77 వేల 610 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా హాంకాంగ్‌లో కూడా కొత్త కేసుల ఏవి నమోదు కాలేదు. ఇక్కడ మొత్తం 1037 మందికి వైరస్ సోకింది. ఇందులో కేవలం నలుగురు మాత్రమే మరణించారు.. అలాగే 830 మంది కోలుకున్నారు. ఇక తైవాన్‌లో ఇప్పటివరకూ 429 కేసులు కనుగొనబడ్డాయి. వారిలో ఆరుగురు మరణించారు.. 311 మంది రోగులకు నయమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories