గాలి ద్వారా కరోనా వస్తుందా?... ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వివరణ

గాలి ద్వారా కరోనా వస్తుందా?... ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వివరణ
x
Highlights

ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా మాటే. ఎప్పుడు ఎవరి నుంచి కరోనా అటాక్ చేస్తుందో తెలియక జనమంతా భయంతో బతుకుతున్నారు. ఇప్పటివరకు కరోనా సోకడానికి తుంపర్లు...

ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా మాటే. ఎప్పుడు ఎవరి నుంచి కరోనా అటాక్ చేస్తుందో తెలియక జనమంతా భయంతో బతుకుతున్నారు. ఇప్పటివరకు కరోనా సోకడానికి తుంపర్లు కారణమని తెలిసినా ఇప్పటికీ ప్రజల్లో కరోనా ఎలా వ్యాపిస్తుందనే సందేహాలు మెదులుతూనే ఉన్నాయి. ఇంతకీ గాలిద్వారా కరోనా సోకుతుందా..? వైద్య నిపుణుల పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

కరోనా సోకడానికి ప్రధాన మార్గం డ్రాప్ లెట్స్. కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు, తమ్మినపుడు వచ్చే నోటి ద్వారా వచ్చే తుంపర్లతో కరోనా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిన విషయం. అంతేకాదు ఆ వ్యక్తి ముట్టుకున్న వస్తువుల్ని ఇతరులు తాకినా వైరస్ వ్యాపిస్తుందనేది కూడా నిపుణులు చెప్పిన మాట. అయితే ఎందరు నిపుణులు కరోనా వ్యాప్తి గురించి క్లారిటీ ఇస్తున్నా జనాల్లో మాత్రం గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో ప్రయాణిస్తుందని తెలిపింది. అయితే ఈ వైరస్ గాలిలో ఎక్కువ సేపు బతకదని కరోనా సోకిన వ్యక్తి పక్కన ఉన్న వారికే ఇది ప్రమాదకరమని తెలిపింది. చైనాలో 75 వేల 465 మంది కరోనా పేషెంట్లను చెక్ చెయ్యగా గాలి ద్వారా వైరస్ వ్యాపించినట్లు తేలలేదని చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే గాలి ద్వారా వైరస్ వ్యాపించదు అని కచ్చితంగా తెలపలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రజలు టెన్షన్ పడకుండా తగిన జాగ్రత్తలు పాటించమని సూచించింది.

ఇక గాలి ద్వారా కరోనా సోకటం సాధ్యమే అని వెల్లడించింది మరో సంస్థ మెడ్ RXIV. అయితే అత్యంత అరుదుగానే ఇది సోకుతుందని తెలిపిన సంస్థ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు పేర్కొంది. అయితే కరోనా చికిత్స అందించే సమయంలో గాలిద్వారా సోకే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే చికిత్సల సందర్బంగా బయటకు వచ్చే వైరస్ గాలిలో మూడు గంటల కంటే ఎక్కువగా బతకలేదని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories