ఇన్నాళ్లూ ఇటలీని వణికించిన కరోనా ఇప్పుడు స్పెయిన్ లో విరుచుకుపడుతోంది

ఇన్నాళ్లూ ఇటలీని వణికించిన కరోనా ఇప్పుడు స్పెయిన్ లో విరుచుకుపడుతోంది
x
Highlights

కరోనా ప్రభావం యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. చైనా తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న యూరప్ దేశాల్లో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి....

కరోనా ప్రభావం యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. చైనా తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న యూరప్ దేశాల్లో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. స్పెయిన్, ఇటలీల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా స్పెయిన్ లో మృతుల సంఖ్య 9 వేలు దాటింది.

ఇన్నాళ్లూ ఇటలీని వణికించిన కరోనా ఇప్పుడు స్పెయిన్ లో విరుచుకుపడుతోంది. ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ‌్య లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో 864 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్పెయిన్ లో కరోనా మృతుల సంఖ్య 9వేలు దాటింది. అయితే కరోనా నేపథ్యంలో ఆ దేశంలో విధించిన ఆంక్షలు ఫలితాన్నిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్యలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుందన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం గత వారం కంటే 8 శాతం పెరిగింది.

ఇటలీలో ఇప్పటివరకు లక్షా ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 15 వేల 7 వందల మంది రికవరీ కాగా 12 వేల 428 మంది చనిపోయారు. బ్రిటన్ లో కొత్త కేసులేమీ నమోదవలేదు. కాగా అక్కడ ఇప్పటివరకు 17 వందల 89 మంది మృత్యువాత పడ్డారు. యూకేలో గడిచిన 24 గంటల్లో 381 మంది ప్రాణాలు విడిచారు. అటు ఫ్రాన్స్ లోనూ కొత్త కేసులు నమోదు కాలేదు.

బ్రిటన్ లో కరోనా చికిత్స కోసం తొలి హాస్పిటల్ ఏర్పాటైంది. లండన్ లో 88 వేల చదరపు మీటర్లలో ఏర్పాటైన నైటింగేల్ హాస్పిటల్ లో ఒకేసారి 4వేల మంది పేషంట్లకు ట్రీట్ మెంట్ చేసేలా ఏర్పాట్లు చేశారు. వారం రోజుల్లోనే ఎక్సెల్ సెంటర్ ను హాస్పిటల్ గా మార్చేశారు.

జర్మనీలో రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు జర్మనీలో దాదాపు 73 వేల కేసులు నమోదవగా నిన్న వెయ్యికి పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం 793 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత కరోనాతో భారీగా ఎఫెక్ట్ పడిన దేశాల్లో ఒకటైన ఇరాన్ లో దాదాపు 3 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 138 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 3 వేలు దాటింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories