బీజింగ్‌లో మరో దఫా విజృంభిస్తున్న కరోనా

బీజింగ్‌లో మరో దఫా విజృంభిస్తున్న కరోనా
x
Highlights

చైనా లోని వుహాన్ లో ఉద్భవించిన కరోనావైరస్ మూడునెలల పాటు ఆ దేశాన్ని వణికించింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే ఫిబ్రవరి నుంచి వ్యాప్తి ప్రభావం చైనాలో దాదాపు తగ్గిపోయింది.

చైనా లోని వుహాన్ లో ఉద్భవించిన కరోనావైరస్ మూడునెలల పాటు ఆ దేశాన్ని వణికించింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే ఫిబ్రవరి నుంచి వ్యాప్తి ప్రభావం చైనాలో దాదాపు తగ్గిపోయింది. దాంతో అన్ని ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో పోయిందనుకున్న కరోనా మళ్ళీ విజృంభించడం ప్రారంభించింది. చైనా రాజధాని బీజింగ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 మందికి మహమ్మారి సోకిందని.. దీంతో ఐదురోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అక్కడ 106కు చేరిందని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.

అంతేకాదు ఈ విషయాన్నీ ఓ ప్రభుత్వ అధికారి సైతం దృవీకరించారు. బీజింగ్ లో వైరస్‌ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందని.. అందువలన ప్రతిఒక్కరు అపప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టాక్సీ, ఆటోల ప్రయాణాలపై రవాణా కమిషన్‌ శాఖ నిషేధం విధించినట్లు చెప్పారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో 276 వ్యవసాయ మార్కెట్లు, 33 వేల ఫుడ్‌, బేవరేజ్‌ సంస్థలను డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories