అద్భుతం ... కరోనా రూపంలో వడగళ్ల వాన

అద్భుతం ... కరోనా రూపంలో వడగళ్ల వాన
x
Highlights

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి ప్రస్తుతం వ్యాక్సిన్ లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సరైనా మార్గాలుగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి.

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి ప్రస్తుతం వ్యాక్సిన్ లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సరైనా మార్గాలుగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. లాక్ డౌన్ ముగిసినంత మాత్రాన కరోనా ఏమీ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్లిపోదాని కరోనాతో ఎలా కలిసి జీవించాలో తెలుసుకొని ఉండలాని పలువురు హెచ్చరిస్తున్నారు..తాజాగా మెక్సికోలో కురిసిన వడగళ్ల వాన కూడా ఇదే చెబుతుంది.

ఇంతకీ ఏం జరిగింది అంటే మెక్సికోలోని మోంటేమోరేలోస్ మున్సిపాలిటీలో భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు వడగళ్లు కూడా కురిశాయి. ఆ వడగాళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి అచ్చం కరోనా వైరస్‌‌లాగానే ఉన్నాయి. దీంతో అంతా ఆ మంచు ముద్దలకు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా న్యూస్ వైరల్ గా మారింది. ప్రజలు ఇళ్లలోనే కుర్చోవాలని ఆ దేవుడు సందేశం పంపాడని అంటున్నారు. అయితే వాతావరణ అధికారులు మాత్రం ఇది సహజమేనని అంటున్నారు. బలమైన గాలులు, ఒత్తిడి వల్ల మంచు ముద్దలు ఒకదాన్ని ఒకటి ఢీకొని భిన్న ఆకారాల్లోకి మారి కిందపడతాయన్నారు. మెక్సికోలో పడిన వడగళ్లు కూడా అలాంటివేనని తెలిపారు. కానీ ప్రజలు మాత్రం ఇది భగవంతుని లీలే అని సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,84,932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 33 వేల 400. వ్యాధి నుంచి 20 లక్షల 21 వేల 813 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయి వెళ్లారు. కాగా కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 29 వేల 719 మంది చనిపోయారు.

ఇక భారత్ విషయానికి వచ్చేసరికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,12,359కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 3435 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 45,300మంది కోలుకోగా మరో 63,624 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories