అగ్రరాజ్యంలో కొనసాగుతోన్న కరోనా మారణహోమం.. మరణాల్లో స్పెయిన్ ను క్రాస్ చేసిన అమెరికా..

అగ్రరాజ్యంలో కొనసాగుతోన్న కరోనా మారణహోమం.. మరణాల్లో స్పెయిన్ ను క్రాస్ చేసిన అమెరికా..
x
Highlights

అగ్రరాజ్యంలో కరోనా మారణహోమం కొనసాగుతోంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలో తన ప్రభావం చూపుతోన్న కరోనా వేల ప్రాణాలు బలితీసుకుంటోంది. ప్రపంచ...

అగ్రరాజ్యంలో కరోనా మారణహోమం కొనసాగుతోంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలో తన ప్రభావం చూపుతోన్న కరోనా వేల ప్రాణాలు బలితీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు 15 లక్షలను క్రాస్ చేయగా కేవలం అమెరికాలోనే 30 శాతం కేసులున్నాయి. ఆ దేశంలో కరోనా కేసులు 4 లక్షల 50 వేలకు చేరువలో ఉన్నాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా విజృంభిస్తుండటంతో అమెరికాలో కరోనా మరణాలు స్పెయిన్ ను క్రాస్ చేశాయి. స్పెయిన్ లో ఇప్పటివరకు 14 వేల 7వందల 92 మంది మరణించగా అమెరికాలో అంతకు పైగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 2 వేల కరోనా మరణాలు 33 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిన్నటి కరోనా మృతుల్లో 11 మంది భారతీయులు ఉండగా మరో 16 మంది ఇండియన్స్ కు కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. వీరిలో పది మంది న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలకు చెందిన వారు కాగా మరో వ్యక్తి ఫ్లోరిడాలో నివాసం ఉంటోన్న వ్యక్తిగా గుర్తించారు. మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పాజిటివ్ అని తేలిన 16 మంది భారతీయులు నిర్బంధంలో ఉన్నారు. ఇందులో ఎనిమిది మంది న్యూయార్క్, ముగ్గురు న్యూజెర్సీ, మిగిలిన వారు టెక్సాస్, కాలిఫోర్నియాలో ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలున్నారు. వీరంతా ఇండియాలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందని వారని అధికారులు తెలిపారు.

అమెరికాలో కరోనా ఎపిసెంటర్లుగా ఉన్న న్యూయార్క్ లో 6 వేల మరణాలు చోటు చేసుకోగా, లక్షా 38 వేల కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఇప్పటివరకు 15 వందల మరణాలు రికార్డయ్యాయి. దాదాపు 48 వేల మంది వైరస్ బారిన పడ్డారు. దాదాపు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా మరణాలు నమోదవగా వ్యోమింగ్ లో ఇప్పటివరకు ఒక్కరు కూడా కరోనాతో మృతి చెందలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories