పాక్ లో కరోనా విజృంభణ.. అయినా అదొక్కటే ఊరట కలిగించే వార్త..

పాక్ లో కరోనా విజృంభణ.. అయినా అదొక్కటే ఊరట కలిగించే వార్త..
x
Highlights

పాకిస్తాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది .. ఆ దేశానికీ చెందిన డాన్ న్యూస్ ప్రకారం, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు వేల 297 కు చేరుకుంది.

పాకిస్తాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది .. ఆ దేశానికీ చెందిన డాన్ న్యూస్ ప్రకారం, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు వేల 297 కు చేరుకుంది. పంజాబ్ ప్రావిన్స్ నుండి గరిష్టంగా 3,168 కేసులు నమోదు కాగా.. సింధ్ ప్రావిన్స్ నుండి 1,688 కేసులు నమోదయ్యాయి.

ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 47 కొత్త కేసులు కనుగొనబడ్డాయి. వీరిలో ఎక్కువ మంది తబ్లిఘి జమాత్‌కు చెందినవారు ఉన్నారు. అలాగే బలూచిస్తాన్ ప్రావిన్స్ గవర్నర్ ప్రకారం, ఇక్కడ మొత్తం 281 కేసులు కనుగొనబడ్డాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వైరస్ భారిన పడి 117 మంది మరణించారు.

అయితే పాకిస్థాన్ కు ఊరట కలిగించే విషయం ఏమిటంటే దేశంలో 1,446 మంది వైరస్ నుండి కోలుకున్నారు. ఇదిలావుంటే పెనుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెంచనున్నట్లు ప్రకటించారు, అయితే దేశం ఆర్ధికంగా నష్టపోకుండా కొన్ని రంగాలకు ఉపశమనం కలిగించే విధంగా ఆర్ధిక వెసులుబాటు ఇవ్వాలని నినాయించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెలలో దేశం మొత్తం లాక్డౌన్ లో కొనసాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories