అంతకంతకూ విజృంభిస్తున్న కరోనావైరస్.. 908 కి చేరిన మృతుల సంఖ్య..

అంతకంతకూ విజృంభిస్తున్న కరోనావైరస్.. 908 కి చేరిన మృతుల సంఖ్య..
x
Highlights

కరోనా మహమ్మారి రోజురోజుకు పంజా విసురుతోంది. కరోనావైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 908 కు పెరిగిందని, ధృవీకరించబడిన కేసుల సంఖ్య 40,000 కు...

కరోనా మహమ్మారి రోజురోజుకు పంజా విసురుతోంది. కరోనావైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 908 కు పెరిగిందని, ధృవీకరించబడిన కేసుల సంఖ్య 40,000 కు పైగా పెరిగిందని చైనా ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం 97 మంది మరణించారు, 3,062 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. తొంభై ఒకటి మరణాలు కూడా ఈ అంటువ్యాధికి కేంద్రంగా ఉన్న హుబే ప్రావిన్స్‌లో సంభవించాయి.

మిగిలిన మరణాలు.. హీలాంగ్‌జియాంగ్, జియాంగ్జీ, హైనాన్ మరియు గన్సులలో ఒక్కొక్కటిగా నమోదైనట్టు కమిషన్ తెలిపింది. మరో 4,008 కొత్త అనుమానిత కేసులు ఆదివారం నమోదయ్యాయి. అంతేకాకుండా, 296 మంది రోగులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు, 6,484 మంది రోగులు తీవ్ర స్థితిలో ఉన్నారని, ఇంకా 23,589 మంది వైరస్ బారిన పడ్డారని అనుమానిస్తున్నట్లు కమిషన్ తెలిపింది.

ఇప్పటికే కోలుకున్న 3,281 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 2.99 లక్షల మందికి వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో.. వారిలో 29,307 మందికి ఆదివారం వైద్య పరిశీలన చేశారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు, 1.87 లక్షల మంది ఇంకా వైద్య పరిశీలనలో ఉన్నారు. ఆదివారం చివరి నాటికి, హాంగ్ కాంగ్‌లో 36 , మకావోలో 10, తైవాన్‌లో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో విదేశాలలో ఇప్పటివరకు 300 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, వాటిలో కేరళకు చెందిన మూడు కేసులు కూడా ఉన్నాయి.

మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా జనవరి 24 న ప్రారంభమైన సెలవులు ఫిబ్రవరి 3 తో ​​ముగిశాయి.. అయితే ఈ సెలవులను ఫిబ్రవరి 9 వరకు పొడిగించారు. తాజాగా ఆదివారం ఇవి ముగియడంతో ప్రజలు మిలియన్ల మంది ప్రజలు బీజింగ్ మరియు చైనాలోని ఇతర నగరాలకు తిరిగి రావడం ప్రారంభించారు. దీంతో వైరస్ అరికట్టే ప్రయత్నాలు కష్టతరంగా మారాయి. ఇప్పటికే చాలా కార్యాలయాల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories