Coronavirus: చైనాలో తగ్గిన మరణాల సంఖ్య.. కానీ కేసులు చూస్తే..

Coronavirus: చైనాలో తగ్గిన మరణాల సంఖ్య.. కానీ కేసులు చూస్తే..
x
Highlights

చైనాలో గురువారం కొత్తగా 327 కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలిపింది. దీంతో చైనాలో ఇప్పటివరకు నమోదైన...

చైనాలో గురువారం కొత్తగా 327 కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలిపింది. దీంతో చైనాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,824 కు చేరుకుంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న సెంట్రల్ హుబీ ప్రావిన్స్ లో 318 కొత్తగా నిర్ధారించబడిన కేసులు ఉన్నాయి, ఇక్కడ ముందు రోజు 409 కేసుల నమోదయ్యాయి.. తాజాగా నమోదైన కేసులతో పోలిస్తే.. జనవరి 24 నుండి కనిష్ట కేసుల సంఖ్య ఇది. హుబే ను మినహాయిస్తే.. ఇతర ప్రాంతాల్లో గురువారం నాటికి కేవలం తొమ్మిది కొత్త కేసులను మాత్రమే నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య ఒక రోజు ముందు 24 గా ఉంది.

ఇక ప్రాదేశిక రాజధాని వుహాన్ లో 313 ధృవీకరించిన కేసులను నివేదించింది, ఈ సంఖ్య ఒక రోజు ముందు 383 గా ఉంది. జనవరి 26 నుండి కనిష్ట కేసుల సంఖ్య ఇదే.. మరోవైపు చైనాలో గురువారం చివరి నాటికి 2,788 మంది మరణించారు, బుధవారం 44 మంది మరణించారు. ఇక గురువారం మొత్తం 69 మంది మరణించారు. వారిలో హుబీ లో గురువారం 41 కొత్త మరణాలను నివేదించగా, వుహాన్‌లో 28 మంది మరణించారు.

ఇదిలావుంటే చైనాలో చిక్కుకున్న 76 మంది భారతీయులు మరియు విదేశీ పౌరులతో ఫిబ్రవరి 27 న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో బంగ్లాదేశ్ నుండి 23 మంది, చైనా నుండి 6, మయన్మార్ మరియు మాల్దీవుల నుండి 2 మరియు దక్షిణాఫ్రికా, యుఎస్ఎ మరియు మడగాస్కర్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే కర్నూలుకు చెందిన యువతి జ్యోతి కూడా ఉన్నారు. వీరిలో ఎవరికీ కూడా కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే వారిని తరలించారు. ఢిల్లీ చేరుకున్న వీరంతా మునుపటి బ్యాచ్‌ల మాదిరిగా 14 రోజుల నిర్బంధంలో ఉంటారు. ఇందుకోసం వారిని ఢిల్లీలో ఆర్మీ క్యాంపునకు దగ్గరలో ఉన్న ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ఇక్కడే మొత్తం 112 మంది నిర్బంధంలో ఉన్నారు. వీరంతా ముందుగా 14 రోజులు నిర్బంధంలో ఉంటారు.. ఒకవేళ అవసరం అనుకుంటే మరో 14 రోజులపాటు ఉంచుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories