కరోనా విషయంలో గుడ్‌న్యూస్.. ఐదు నిమిషాల్లోనే..

Coronavirus Loses Ability to Infect Within 5 Minutes
x

కరోనా విషయంలో గుడ్‌న్యూస్.. ఐదు నిమిషాల్లోనే..

Highlights

Coronavirus: ప్రపంచ దేశాలను మరోమారు కలవరపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Coronavirus: ప్రపంచ దేశాలను మరోమారు కలవరపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వైరస్ తన సంక్రమణ సామర్థ్యాన్ని ఐదు నిమిషాల్లో కోల్పోతున్నట్టు అధ్యయనంలో వెల్లడైనట్టు వెల్లడించారు. వైరస్ 20 నిమిషాల పాటు గాలిలో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తోందని, గాలిలో ఉన్న తొలి 5 నిమిషాల్లోనే సంక్రమణ శక్తిని పెద్ద మొత్తంలో కోల్పోతోందని చెప్పారు. ఈ మేరకు యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన అధ్యయనం స్పష్టం చేసింది.

అంతేకాదు, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా కరోనాకు చెక్ చెప్పవచ్చని పేర్కొన్నారు. వెంటిలేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల కంటే ప్రజలు దగ్గరగా ఉన్నప్పుడే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories