Coronavirus: రష్యా, బ్రెజిల్, భారత్‌లో డేంజర్ బెల్స్.. ఆ దేశంలో మాత్రం జీరో కేసులు

Coronavirus: రష్యా, బ్రెజిల్, భారత్‌లో డేంజర్ బెల్స్.. ఆ దేశంలో మాత్రం జీరో కేసులు
x
Representational Image
Highlights

ప్రపంచదేశాలన్నీటిని కరోనా మహమ్మరి వణికిస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఆంక్షల్ని సడలిస్తుంటే క్రమంగా కరోనా మళ్లీ పెరుగుతోంది.

ప్రపంచదేశాలన్నీటిని కరోనా మహమ్మరి వణికిస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఆంక్షల్ని సడలిస్తుంటే క్రమంగా కరోనా మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 77, 515 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,41204కి చేరింది. సోమవారం ఒక్కరోజే 3,802 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2,51,947కి చేరింది.

కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలోనే మళ్ళీ విజృంభిస్తుంది. ప్రస్తుతం 49627 మందికి ICUలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుంది. సోమవారం కొత్తగా 23,716 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 12,11,838కి చేరాయి. అలాగే సోమవారం 1112 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 69,709కి చేరింది.

రష్యాలో సోమవారం ఒక్క రోజే 1,581 కేసులొచ్చాయి. అలాగే బ్రెజిల్ 6697, బ్రిటన్ 3985లో కేసులు విపరీతంగా పెరిగాయి. న్యూజిలాండ్ లో కరోనా వైరస్ పూర్తిగా కంట్రోల్ అయింది. అక్కడ 1337 కేసులు నమోదు కాగా.., 20 మంది మృత్యువాత పడ్డారు. 1337 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయగలిగింది.

ఇక భారత్ లోను కేసుల సంఖ్య వీపరితంగా పెరుగుతున్నాయి. ఇండియాలో 42,836 కేసులుండగా.. మృతుల సంఖ్య 1389కి చేరింది. మహారాష్ట్ర లో 12,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 548 మంది మృతి చెందారు. గుజరాత్, ఢిల్లీ లోను అంతకంతకూ పెరుగుతుంది. గుజరాత్ లో 5,428 కేసులు, 290 మరణాలు సంభవించాయి. ఢిల్లీ 4549 మందికి కరోనా సోకాగా.. 64 మంది మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories