రూటు మార్చిన కరోనా.. ఇప్పుడు..

రూటు మార్చిన కరోనా.. ఇప్పుడు..
x
Highlights

ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోంది. దాదాపు అన్ని దేశాలపై సత్తా చాటుతోంది. దేశాలకు దేశాలే దాని బారిన పడి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఎలా బయటపడాలో తెలియక తలలు...

ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోంది. దాదాపు అన్ని దేశాలపై సత్తా చాటుతోంది. దేశాలకు దేశాలే దాని బారిన పడి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఎలా బయటపడాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. లక్షల మంది దాని బారిన పడి జీవితపు చివరి మజిలీకి చేరుకుంటున్నారు. వేలాదిగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా తన రూటు మార్చింది. ఇప్పుడు జంతువులకు కూడా సోకడంతో కొవిడ్ వైరస్ సమస్త జీవరాశి మనుగడనే ప్రశ్నిస్తోంది.

ప్రపంచ గమనాన్ని మార్చింది - మానవ జాతి ఊపిరితీస్తోంది - జంతు జాలాన్ని వదలనంటోంది

కరోనా రక్కసి కోరల్లో మనుషులతో పాటు జంతు జాలం చిక్కుకుంటోంది. ఇప్పటివరకు మానవ జాతిని పట్టి పీడించిన మహమ్మారి తాజాగా అమెరికాలోని ఓ పులికి కూడా సోకింది. న్యూయార్క్‌లోని బ్రాంగ్జ్‌ జూలో నదియా అనే పులికి కొవిడ్ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నదియాకు వైరస్ లక్షణాలు ఉన్నట్లు జూ అధికారులు వెల్లడించారు. ఆ పులి బాగోగులు చూసుకునే వ్యక్తి నుంచే వైరస్ సోకినట్లు తెలిపారు.

పులిపై కరోనా పంజా - పిల్లులనూ వదలని కొవిడ్ - జంతుజాలంపై కూడా కొవిడ్ ఎఫెక్ట్‌

ఇక నాలుగేళ్ల వయస్సున్న నదియాతో పాటు ఆ జూలోని మరో పులి అజుల్, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని జూ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ జంతువులన్నీ వెటర్నరీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాయని త్వరలోనే కోలుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వైరస్ బాధిత జంతువులను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని వాటి సంరక్షకులకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే కరోనా విజృంభణతో న్యూయార్క్ విలవిల్లాడిపోతోంది. అమెరికాలో పాజిటివ్ కేసుల్లో 30 నుంచి 40 శాతం కేసులు న్యూయార్క్‌లో నమోదవుతున్నవే. దీంతో అక్కడ వైరస్ జంతుజాలంపై కూడా ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత వారం బెల్జియంలో ఓ పిల్లికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అలాగే మరో ఆరు పిల్లుల్లోనూ ఆ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది.

దీంతో మనదేశంలోనూ జూలలో ఉన్న జంతువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని ప్రధాన జూలలోనూ భద్రతా చర్యలు పెంచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories