అమెరికా వీసాలపై కరోనా ఎఫెక్ట్.. అమెరికా వీసాల జారీ నిలిపివేత

అమెరికా వీసాలపై కరోనా ఎఫెక్ట్.. అమెరికా వీసాల జారీ నిలిపివేత
x
Highlights

కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. కోవిడ్ దాటికి అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి....

కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. కోవిడ్ దాటికి అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ రద్దవుతున్నాయి. కోవిడ్ కేసులు దేశంలో అధికారికంగా 81 నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి దాటికి 5వేల మందిపైగా మృత్యువాతపడ్డారు.

అమెరికా వీసాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. మార్చి 16 నుంచి అమెరికా వీసాల జారీ నిలిపివేయాలని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే వీసాల జారీని నిలిపివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories