కరోనా ఎఫెక్ట్‌.. ఆ వ్యక్తి ఆలోచనకు నెటిజన్లు ఫిదా

కరోనా ఎఫెక్ట్‌.. ఆ వ్యక్తి ఆలోచనకు నెటిజన్లు ఫిదా
x
కరోనా ఎఫెక్ట్‌.. ఆ వ్యక్తి ఆలోచనకు నెటిజన్లు ఫిదా
Highlights

కరోనా కల్లోలంతో ప్రజలు చేతులు కలపడానికి జంకుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా వారి సంస్కృతి, అలవాట్ల పై కూడా చూపిస్తోంది....

కరోనా కల్లోలంతో ప్రజలు చేతులు కలపడానికి జంకుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా వారి సంస్కృతి, అలవాట్ల పై కూడా చూపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

వీడియోలో ఉన్న ఈ వ్యక్తి కరోనా భయంతో ముఖానికి మాస్క్‌ ధరించాడు. ఆయన స్నేహితులలో ఒకరు అతని వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతుండగా నిరాకరించాడు. ఒక్క క్షణం ఆగి పునరాలోచనలో పడ్డాడు. వారికి వచ్చిన ఓ కొత్త ఆలోచన ప్రకారం కాలు కదుపుతూ లెగ్‌షేక్ ద్వారా గ్రీట్‌ చేసుకున్నారు. అనంతరం ఆ స్నేహితుడు తన దారిన తాను వెళ్లిపోతాడు. ఆ తరువాత ఆ వ్యక్తి మిగిలిన స్నేహితులను అదే స్టైల్లో పలకరించాడు.

కరోనా వ్యాపించకుండా లెగ్‌షేక్‌ ఇచ్చుకోవాలనే ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది అద్భుతమైన ఆలోచన అని అసలు కరోనా సద్దుమణిగిన తరువాత కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోవడం బెటరని కామెంట్లు చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories