China: 490కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య..

China: 490కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య..
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో మరణించిన వారి సంఖ్య ఫిబ్రవరి 5న 490 కు పెరిగింది. ఒక్క హుబీ ప్రావిన్స్ లోనే 65 మంది మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి.

కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో మరణించిన వారి సంఖ్య ఫిబ్రవరి 5న 490 కు పెరిగింది. ఒక్క హుబీ ప్రావిన్స్ లోనే 65 మంది మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. గత నెల నుంచి మరణాలు సంభవిస్తున్న సమయం నుంచి ఒక్కరోజులోనే ఏకంగా 65 మంది మృతి చెందడం ఇదే మొదటిసారి. 20 కి పైగా దేశాలు వైరస్ కేసులను ధృవీకరించాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అలాగే పలు ప్రభుత్వాలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని, చైనాకు బయలుదేరే విమానాలను నిలిపివేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

జనసాంద్రత కలిగిన చైనీస్ మెట్రోపాలిటన్ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ఇతర ప్రాంతాల ప్రజలను అంత సులువుగా అనుమతించడం లేదు. వారిని పూర్తిస్థాయిలో పరీక్షించిన తరువాతే.. అనుమతిస్తున్నారు. ఇది ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువులపై మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే వారికి భయాందోళన కలిగిస్తోంది. మరోవైపు తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని మూడు నగరాల్లోని షాంఘై సహా ప్రాంతాల్లో ఇళ్లను విడిచిపెట్టే వారిని బలవంతంగా నిర్బంధం చేస్తున్నారు.

హాంగ్జౌలోని మూడు జిల్లాలు - చైనీస్ టెక్ దిగ్గజం అలీబాబా యొక్క ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంతో అయితే.. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు ఒక వ్యక్తి మాత్రమే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇక్కడే దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. ఈ ప్రాంతం షాంఘైకి నైరుతి దిశలో 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఒక మరణం సహా 200 కి పైగా కేసులు నమోదయ్యాయి.

ఇక జెజియాంగ్ లో 829 కేసులను ధృవీకరించారు. అయితే సెంట్రల్ ప్రావిన్స్ హుబే వెలుపల అత్యధిక సంఖ్యగా నమోదయింది. కేసుల సంఖ్య ఎంత అన్నది వెల్లడికాలేదు. ఇదిలావుంటే రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో చైనా పూర్తిస్థాయిలో అప్రమత్తం అయింది. ఎక్కడికెక్కడ కరోనా ఆసుపత్రులను నియమిస్తుంది. ఇందుకోసం వేలకోట్ల నిధులను విడుదల చేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories