Coronavirus: అక్కడ తగ్గినట్టే తగ్గి.. మల్లి విజృంభిస్తున్న కరోనా..

Coronavirus: అక్కడ తగ్గినట్టే తగ్గి.. మల్లి విజృంభిస్తున్న కరోనా..
x
Highlights

చాలా రోజుల మందగమనం తరువాత ఫ్రాన్స్ లో కరోనా వైరస్ మరణాలు మళ్లీ పెరిగాయి.

చాలా రోజుల మందగమనం తరువాత ఫ్రాన్స్ లో కరోనా వైరస్ మరణాలు మళ్లీ పెరిగాయి.. గతంలో 9 వేలతో పోతుందనుకున్న వైరస్ మరింతమందిని బలితీసుకుంది. దీంతో అత్యధిక మరణాల జాబితా దేశాల్లో నిలిచింది. గత 24 గంటల్లో ఆసుపత్రులలో COVID-19 నుండి 605 మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం వెల్లడించింది. దాంతో కరోనావైరస్ కారణంగా ఫ్రాన్స్ మంగళవారం 10,000 మరణాల సంఖ్యను దాటింది, ఆసుపత్రిలో 7,091 .. వృద్ధాప్య గృహాలలో 3,237 మంది మరణించారని ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.

ప్రస్తుతం మొత్తం 7,131 మంది ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని ఉన్నత ఆరోగ్య అధికారి జెరోమ్ సలోమన్ జర్నలిస్టులతో చెప్పారు.. మరోవైపు "అంటువ్యాధి దాని పురోగతిని కొనసాగిస్తోంది" అని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు కేసులు కూడా అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి.

హాస్పిటల్ , నర్సింగ్ హోమ్ గణాంకాలను కలిపి మొత్తం కేసుల సంఖ్య గత 24 గంటల్లో 5,171 పెరిగి 98,010 కు చేరుకుంది, అంటే ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ , జర్మనీ తరువాత 100,000 పరిమితిని దాటిన ఫ్రాన్స్ ఐదవ దేశంగా అవతరించినట్టయింది. మరోవైపు నర్సింగ్ హోమ్స్ మరణాలు కూడా 10 శాతం పెరిగి 2,417 కు చేరుకున్నాయి. దీంతో నర్సింగ్ హోమ్స్ పై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories