అగ్రరాజ్యంలో కరోనా సంక్షోభం.. వైద్య సదుపాయాలు కల్పించలేకపోతోన్న అమెరికా

అగ్రరాజ్యంలో కరోనా సంక్షోభం.. వైద్య సదుపాయాలు కల్పించలేకపోతోన్న అమెరికా
x
Highlights

లక్షలు దాటుతున్న కరోనా కేసులు, రోజుకు వేల సంఖ్యలో మరణాలు ఇదీ ప్రస్తుతం అమెరికా ఎదుర్కుంటోన్న పరిస్థితి. కరోనా మహమ్మారితో ఆ దేశం ఎన్నడూ లేనంత...

లక్షలు దాటుతున్న కరోనా కేసులు, రోజుకు వేల సంఖ్యలో మరణాలు ఇదీ ప్రస్తుతం అమెరికా ఎదుర్కుంటోన్న పరిస్థితి. కరోనా మహమ్మారితో ఆ దేశం ఎన్నడూ లేనంత సంక్షోభంలో చిక్కుకుంది. సరైన వైద్య సదుపాయాలు అందించలేక విలవిల్లాడుతోంది.

అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు వేల కొద్దీ కేసులు వస్తుండటంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. అభివృద్ధి చెందిన దేశమైనా అత్యవసర స్థితిలో వైద్య సదుపాయాన్ని అందించలేకపోగా అటు ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటంతో కరోనా విలయంలో చిక్కుకుంది అమెరికా. కరోనా కారణంగా యూఎస్ లో ఉపాధి కరువైంది. దీంతో చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

అమెరికాలో ఇప్పటివరకు 2 లక్షల 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కూడా వందల సంఖ్యలో కేసులు వస్తుండగా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 6 వేలు దాటింది. 24 గంటల్లోనే 11 వందలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.

మరోవైపు యూఎస్ లో ఇప్పటికే మాస్క్ లు, శానిటైజర్లతో పాటు వైద్య పరికరాలకు కొరత ఏర్పడింది. న్యూయార్క్ లో కరోనా నుంచి తమను రక్షించేందుకు సామాగ్రి లేదంటూ నర్సులు ఆందోళన చేస్తున్నారు. ఇక వెంటిలేటర్లు లేక ఉక్కిరిబిక్కిరవుతోన్న అగ్రరాజ్యానికి ఊరట కలిగించారు భారత ఇంజినీర్లు. మసాచుసెట్స్ వర్శిటీ సాయంతో తక్కువ ధరకే వెంటిలేటర్లను రూపొందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories