Coronavirus: చైనాలో మరోసారి పెరిగిన కేసులు..

Coronavirus: చైనాలో మరోసారి పెరిగిన కేసులు..
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన చైనాలో కేసులు మరోసారి పెఱుగుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన చైనాలో కేసులు మరోసారి పెఱుగుతున్నాయి. చైనాలోని ప్రధాన భూభాగంలో 10 కొత్త కరోనావైరస్ కేసులను ఆరోగ్య అధికారులు నివేదించారు, అయితే ప్రస్తుతం నమోదయ్యే కేసులు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వస్తున్నాయని చైనా చెబుతోంది. తాజాగా 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక రోజు ముందు 30 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 23 మంది విదేశాల నుంచి వచ్చిన వారే అని చెప్పింది. జాతీయ ఆరోగ్య కమిషన్ బుధవారం ధృవీకరించిన కొత్త COVID-19 కేసులలో ఆరు విదేశాలలో సంక్రమించాయని స్పష్టం చేసింది.

మరోవైపు ప్రధాన భూభాగం చైనాలో ఇప్పటివరకూ ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడు 82,798 గా ఉంది. కొత్త COVID-19 మరణాలు ఏవీ నివేదించబడలేదు, మూడు రోజుల క్రితం మరణాల సంఖ్య 4,632 గా ఉంది. గత మూడు రోజుల నుంచి కూడా ఒక్క మరణం నమోదు కాలేదు. ఇదిలావుంటే చైనాలో వుహాన్ లో ఉద్భవించిన కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. దాదాపు 190 దేశాల్లో కరోనా కేసులు ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో మరణాలు సంభవించలేదు.. ఇది ఆ దేశాలకు ఊరట కలిగించే విషయం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories