ఆసియాలో విజృంభిస్తోన్న కరోనా.. ప్రపంచంలో 10 దేశాల్లో కరోనా హవా

ఆసియాలో విజృంభిస్తోన్న కరోనా.. ప్రపంచంలో 10 దేశాల్లో కరోనా హవా
x
Representational Image
Highlights

కరోనా వైరస్‌ ఇకపై ఆసియా దేశాల్లో విజృంభించనుందా ? ఆసియాలో నానాటికీ పెరుగుతున్న కొత్త కేసులను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. భారత్‌తో పాటు...

కరోనా వైరస్‌ ఇకపై ఆసియా దేశాల్లో విజృంభించనుందా ? ఆసియాలో నానాటికీ పెరుగుతున్న కొత్త కేసులను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. భారత్‌తో పాటు పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 39 దేశాల్లో కొత్త కేసులు వేగంగా పెరుగుతుంటే అందులో 14 ఆసియా దేశాలే ఉన్నాయి. వీటిలో భారత్‌, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఖతర్‌, కువైట్‌, కజకస్థాన్‌, తైవాన్‌, శ్రీలంక, మాలి, ఆర్మేనియా, బ్రూనైలున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మొదటి 10 దేశాల్లో 7 ఆసియా దేశాలే.

రష్యాలో వేగంగా విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా రోజుకు 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 68,622 అయ్యాయి. ఈ లెక్కన మరో మూడు రోజుల్లోనే మొత్తం కేసుల విషయంలో చైనాను మించిపోనుంది. రష్యాలో లాక్‌డౌన్‌ను ఆలస్యంగా అమలుచేయడం, క్వారంటైన్‌ను చాలామంది తేలికగా తీసుకోవడం, ఈస్టర్‌ ప్రార్థనల్లో భౌతిక దూరం పాటించకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. కొత్త కేసుల నమోదులో బ్రెజిల్‌ రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని కెనడా ఆక్రమిస్తోంది.

కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నా మనదేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో బాధితులు 30 వేలు దాటే అవకాశం ఉందన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దేశంలోని మొత్తం కేసుల్లో 92 శాతం ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories