Coronavirus: చైనా తరువాత ఆ దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్..

Coronavirus: చైనా తరువాత ఆ దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్..
x
Highlights

చైనా నుండి ఉద్భవించిన కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. శనివారం, దక్షిణ కొరియాలో 594 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం 2,931 కేసులు నమోదయ్యాయి.

చైనా నుండి ఉద్భవించిన కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. శనివారం, దక్షిణ కొరియాలో 594 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం 2,931 కేసులు నమోదయ్యాయి.. దక్షిణ కొరియా లోని డేగు నగరం నుండి అనేక సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రమాదంగా ప్రకటించిన తరువాత ఈ వైరస్ ఇప్పటివరకు కనీసం 56 దేశాలలో వ్యాపించింది. ఇటలీలో, కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 19 గా ఉంది. తాజాగా మెక్సికో శుక్రవారం వైరస్ యొక్క మొదటి కేసును నిర్ధారించింది.

ముందుజాగ్రత్త చర్యగా, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటలీ కోసం ఒక హెచ్చరికను జారీ చేసింది. వ్యాప్తి కారణంగా ఇటలీకి ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అమెరికన్ పౌరులసూచించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 83,650 కి పైగా కరోనావైరస్ కేసులు నిర్ధారించబడ్డాయి, చైనాలో 78,961 మంది వ్యాధి బారిన పడ్డారు మరియు 2,791 మంది మరణించారు.

బెలారస్, లిథువేనియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మరియు నైజీరియా దేశాలు తమ మొదటి కరోనా వైరస్ కేసులను నివేదించాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో, స్విట్జర్లాండ్ వచ్చే శుక్రవారం జెనీవాలో జరగాల్సిన అంతర్జాతీయ కార్ షోను రద్దు చేశారు.. ఈ ప్రదర్శన పరిశ్రమ యొక్క అతి ముఖ్యమైన సమావేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో , వియత్నాం దేశంలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి.. వైరస్ ను అంతమొందించడంలో ఆ దేశ వైద్యులు స్పందించిన తీరు వేగంగా ఉందని.. అందుకే వ్యాప్తి ఎక్కువగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వియాత్నంలో మొత్తం 16 మంది సోకిన రోగులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది, అలాగే ప్రాణాంతక వ్యాధి నుండి రోగులకు విముక్తి లభించిందని వైద్యులు ప్రకటించారు. గత 15 రోజులుగా, శుక్రవారం సహా, కొత్త అంటువ్యాధుల కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ప్రభుత్వం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories