డ్రాగన్‌ కంట్రీకి కరోనా వైరస్‌ వణుకు

Corona Virus In China | Telugu News
x

డ్రాగన్‌ కంట్రీకి కరోనా వైరస్‌ వణుకు

Highlights

China: జియామెన్‌ నగరంలో భారీగా కొత్త కేసులు

China: కరోనా అంటే.. చైనా భయపడుతోందా? లేక.. అతి జాగ్రత్తలను పాటిస్తుందా? అనేది అస్సలు అర్థం కాదు. పాజిటివ్‌ కేసు నమోదయ్యిందంటే.. డ్రాగన్‌ ప్రభుత్వం చేసే ఓవర్ అంతా ఇంతా కాదు. కేసు బయటపడిన ప్రాంతంలో కోవిడ్‌ పరీక్షలు చేస్తూ... అక్కడి అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారు. కోవిడ్ పరీక్షలను మనుషులకు మాత్రమే కాదు... ఇటీవల జంతువులకు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా చేపలు, పీతలకు కూడా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కోవిడ్‌ అంటే.. చైనా ఎందుకు అంత ఉలిక్కిపడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు విషయాలను చైనా బయటపెట్టడం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories