Corona Vaccine Clinical Trails: ఏ వ్యాక్సిన్ ఏ దశలో.. ముందంజలో పన్నెండు

Corona Vaccine Clinical Trails: ఏ వ్యాక్సిన్ ఏ దశలో.. ముందంజలో పన్నెండు
x
Coronavaccine Vaccine Clinical Trails
Highlights

Corona Vaccine Clinical Trails: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది.

Corona Vaccine Clinical Trails: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది. ఏ దేశం వ్యాక్సిన్ ముందుగా విడుదల చేస్తోంది అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. దాదాపుగా ఎక్కువ దేశాలు వ్యాక్సిన్ ముందు తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. వీటిలో భాగంగా ప్రస్తుతం ఏ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం.. వీటికి సంబంధించిన వివరాలు మరింత విపులంగా తెలుసుకోవచ్చు.

కరోనా నివార‌ణ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. 150కి పైగా నిపుణుల బృందాలు ఇందుకోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాయి. భార‌త్‌లో త‌యార‌వుతున్న రెండింటితో క‌లిపి మొత్తం 12 వ్యాక్సిన్ల‌కు సంబంధించిన‌ ప్ర‌యోగాల ఫ‌లితాల‌పై నిపుణులు న్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఆ వ్యాక్సిన్లు ఏమిటి? ఏయే ద‌శ‌లో ఉన్నాయి?

చైనాలో ముఖ్యంగా 4 వ్యాక్సిన్లకు సంబంధించిన‌ అభివృద్ధి వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఒక వ్యాక్సిన్‌కు ఇప్ప‌టికే అనుమ‌తులు ల‌భించాయి. క్యాన్‌సినో బయోలాజిక్స్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ అన్ని ప‌రీక్ష‌లు పూర్తి చేసుకుంది. ఇక వ్యూహాన్ ఇనిస్టిట్యూట్, సినోఫార్మా క‌లిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్ రెండో ద‌శ‌ను పూర్తి చేసుకోగా.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బుటాన్ట‌‌న్ రూపొందిస్తున్న మ‌రో వ్యాక్సిన్ కూడా మూడో ద‌శ ప్ర‌యోగానికి సిద్ద‌మ‌వుతోంది. ఇక బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సినో ఫార్మా రూపొందిస్తున్న మ‌రో వ్యాక్సిన్ కూడా రెండో ద‌శలో విజ‌య‌వంతమైంది.

అమెరికాలో బయోటెక్‌ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్ త్వ‌ర‌లో మూడోదశ పరీక్షలను నిర్వహించనుంది. అలాగే ఆ దేశానికే చెందిన నోవావాక్స్ రూపొందిస్తున్న మ‌రో వ్యాక్సిన్ కూడా తుది ద‌శ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌, ఫోజ‌న్ ఫార్మా, పీఫైజర్‌ కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ పై రెండో దశ మానవ పరీక్షలు జ‌రిగాయి.

యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రా జెనికా సంస్థ తుది ద‌శ ప‌రీక్ష‌ల‌ను కూడా పూర్తి చేసుకొని.. అప్రూవ‌ల్‌కు రెడీగా ఉంది. అలాగే లండ‌న్‌లోని ఇంపిరియ‌ల్ కాలేజీ అభివృద్ధి చేస్తున్న మ‌రో వ్యాక్సిన్ రెండో ద‌శ‌ను పూర్తి చేసుకుంది.

ఆస్ట్రేలియాలో వాక్సిన్ లిమిటెడ్ కంపెనీ మెడిటోక్స్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ క్లిన‌క‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకోవ‌డంతో పాటు.. ఫేస్ 1 ప్ర‌యోగ ద‌శ‌ను పూర్తి చేసుకుంది.

ఇండియాలో భార‌త్ బ‌యోటెక్‌, జైడూస్ క్యాడిలా రూపొందిస్తున్న వ్యాక్సిన్స్ ప్రీ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకొని.. మాన‌వుల‌పై ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఏ ద‌శ‌లో ఏం జ‌రుగుతుంది?

ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌: వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగిస్తారు.

ఫేజ్‌ 1: అతి కొద్ది మందిపై పరీక్షిస్తారు. సురక్షితమా కాదా? రోగ నిరోధక వ్యవస్థను అంచ‌నా వేస్తారు.

ఫేజ్‌ 2: వందల మందిపై ప్ర‌యోగిస్తారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై ఎలా ఉంటుందో ప‌రిశీలిస్తారు.

ఫేజ్‌ 3: వేలాది మందిపై ప‌రీక్షిస్తారు. . ఏ తరహా జన్యుసమూహాలపై ఎలాంటి ప్ర‌భావాలు చూపిస్తుందో అధ్య‌య‌నం చేస్తారు

Show Full Article
Print Article
Next Story
More Stories