అక్కడ ట్రెండింగ్ లో కరోనా వెండి ఆభరణాలు!

అక్కడ ట్రెండింగ్ లో కరోనా వెండి ఆభరణాలు!
x
Highlights

కరోనా వైరస్‌.. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే రష్యాలోని ఓ మెడికల్ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని...

కరోనా వైరస్‌.. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే రష్యాలోని ఓ మెడికల్ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని ఆభరణంగా మార్చేసింది. నేటి యువతరం అభిరుచికి అనుగుణంగా ఆమె రూపొందించిన ఈ వైరస్ పెండెంట్ కి ఆదరణ కూడా బాగుంది.

ప్రపంచం కరోనా పేరు చెబితే హడలిపోతోంది. క్షణ క్షణానికి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కొందరు బలహీనులు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తుంటే.. దాని రూపాన్ని ఆభరణంలా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు జ్యుయెలరీ తయారీ దార్లు. రష్యాకి చెందిన డాక్టర్‌ వొరొబెవ్‌.. ఓ 'మెడికల్‌ జ్యువెలరీ 'నగల వ్యాపారి. మెడికల్‌ జ్యువెలరీ అంటే వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్‌ జ్యువెలరీని ధరిస్తుంటారు. అయితే ఇటీవల చైనాలో పుట్టిన కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసిన వైద్య శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దాని రూపాన్ని కనిపెట్టారు. కరోనా అనే మాటకు లాటిన్ లో కిరీటం అని అర్ధం గుండ్రంగా ఉండే ఈ వైరస్‌ చుట్టు కొమ్ములు ఉండి చివరన కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. ఈ వైరస్‌ ఆకారం ఎలా ఉంటుందో ప్రకటించగానే డాక్టర్‌ వొరొబెవ్‌ వైరస్‌ ఆకృతితో వెండి పెండెంట్స్‌ తయారు చేయడం ప్రారంభించారు. 13 డాలర్లకు ఒక పెండెంట్‌ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కరోనా అనే పేరు ట్రెండింగ్‌గా ఉండటంతో యువత వీటిని ఆసక్తిగా కొంటున్నారు. అలాగే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఈ జ్యువెలరీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కరోనా వల్ల వేల మంది బాధలు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుంటే మీరు వ్యాపారం చేస్తున్నారా? అని వొరొబెవ్‌ను కడిగిపారేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఈ కామెంట్స్‌ని పట్టించుకోకుండా తనను తాను సమర్థించుకుంటోంది. 'నేను తయారు చేస్తున్నది మెడికల్ జ్యువెలరీ. వైద్య సిబ్బంది మంచి కోసమే నేను వీటిని తయారు చేస్తున్నా. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్ నిలుస్తుందని ఆన్సర్' ఇస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories