Corona: ఇవాళ దేశమంతటా ఆస్పత్రుల్లో కరోనా మాక్ డ్రిల్

Corona Mock Drill In Hospitals Across The Country Today
x

Corona: ఇవాళ దేశమంతటా ఆస్పత్రుల్లో కరోనా మాక్ డ్రిల్

Highlights

Corona: ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేంద్రం సూచన

Corona: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ అంతకంతకు పెరుగుతుండటంతో ఆందోళన కొనసాగుతోంది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తాజాగా నాలుగో వేవ్‌కు సంబంధించి ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. జనమంతా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇవాళ దేశమంతా మాక్ డ్రిల్ చేయాలని నిర్ణయించింది. ఇవాళ్టి మాక్ డ్రిల్‌లో వైద్యాధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరూ పాల్గొంటారు. కరోనా ఫోర్త్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్‌గా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. కరోనా పేషెంట్లను ఆస్పత్రులకు తరలించడం, వారికి మందులు ఇవ్వడం, ఆక్సిజన్ కిట్ల ఏర్పాటు, ఐసోలేషన్, క్వారంటైన్ తదితర కరోనా జాగ్రత్తలు పాటించడం ఎలా అన్నది ఒకసారి మాక్ డ్రిల్‌లో చేస్తారు. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈపాటికే ఏర్పాట్లు చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories