అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా కన్ను.. 200 మంది సైనికులతో చొరబాటుకు యత్నం

Conflicts Between Indian and Chinese Forces at Tawang Sector
x

తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా బలగాల మధ‌్య ఘర్షణ (ఫైల్ ఫోటో)

Highlights

* అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా కన్ను * 200 మంది సైనికులతో చొరబాటుకు యత్నం * సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం

China-India Border Conflict: డ్రాగన్ కంట్రీ మళ్లీ వక్రబుద్ధి చూపింది. భారత భూభాగాల ఆక్రమణకు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించిన చైనా తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌పై కన్నేసింది. ఇటీవల ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన చైనా గతవారం తవాంగ్ సెక్టార్‌లో భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. ఏకంగా 2 వందల మంది సైన్యంతో చొరబాటుకు ప్రయత్నించాయి.

చైనా సైన్యం భారత్‌లోకి ప్రవేశించడాన్ని గుర్తించిన భారత బలగాలు వారిని నిలువరించాయి. గతవారం జరిగిన ఈ ఘటనలో రెండు దేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటనలో భారత సైనికులకు ఎలాంటి న‌ష్టం వాటిల్లలేదని పేర్కొన్నాయి. గతంలో కూడా చైనా సరిహద్దుల్లో ఇలాంటి చొరబాటు యత్నాలకు పాల్పడింది. ఈ ఏడాది ఆగస్టు 30న దాదాపు 100 మంది చైనా జవాన్లు ఉత్తరాఖండ్‌లోని బారాహొతి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ దాటారు. 5 కిలోమీటర్ల లోపలికి వచ్చి మూడు గంటల పాటు భారత భూభాగంలోనే ఉన్నారు. అక్కడి వంతెన ధ్వంసం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories