చైనాలో సరికొత్త మ్యాగ్లెవ్ రైలు: గంటకు 600 కిలోమీటర్ల వేగం, విమానాలకు పోటీ!

చైనాలో సరికొత్త మ్యాగ్లెవ్ రైలు: గంటకు 600 కిలోమీటర్ల వేగం, విమానాలకు పోటీ!
x

China Unveils New Maglev Train: 600 kmph Speed to Rival Air Travel!

Highlights

చైనా తాజాగా పరిచయమైన మ్యాగ్లెవ్ హైస్పీడ్ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది విమానాలకు సవాల్ విసరడంతోపాటు, ప్రపంచంలోనే వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలవనుంది.

చైనాలో కొత్త మ్యాగ్లెవ్ రైలు పరిచయం: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే టెక్నాలజీ మిరాకిల్

బీజింగ్‌:

అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, ప్రపంచ వేగవంతమైన రైలును పరిచయం చేసి మరోసారి దృష్టిని ఆకర్షించింది. గంటకు 600 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఈ మ్యాగ్లెవ్ హైస్పీడ్ ట్రైన్ (Maglev High Speed Train) ను బీజింగ్‌లో జరిగిన 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

7 సెకన్లలో 600 కిలోమీటర్లు: ట్రావెల్‌లో రివల్యూషన్!

చైనా కొత్తగా రూపొందించిన ఈ రైలు కేవలం 7 సెకన్లలోనే 600 kmph వేగాన్ని చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఇది వినియోగంలోకి వస్తే బీజింగ్ నుంచి షాంఘై మధ్య 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 2.5 గంటల్లో పూర్తిచేయవచ్చు. ప్రస్తుతం దీనికైన సమయం సుమారు 5.30 గంటలు.

Maglev టెక్నాలజీ ప్రత్యేకతలు:

ఈ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ (Maglev Technology) ఆధారంగా పనిచేస్తుంది. అంటే, రైలును ట్రాక్‌ నుంచి పైకి లేపే విధంగా వ్యతిరేక అయస్కాంత క్షేత్రాలు పనిచేస్తాయి. ఫ్రిక్షన్ లేకపోవడంతో రైలు నిశ్శబ్దంగా, మరింత వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని బీజింగ్ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

డిజైన్, స్పెసిఫికేషన్స్:

  • బరువు: 1.1 టన్నులు
  • ఆకృతి: బుల్లెట్ షేప్, నాజూగ్గా తయారు
  • శబ్ద రహిత ప్రయాణం
  • అధిక వేగంలో స్థిరంగా ప్రయాణించే డిజైన్

చైనా హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ విశేషాలు:

  • ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది.
  • 2023 చివరినాటికి: 48,000 కిలోమీటర్లు
  • 2024 లక్ష్యం: 50,000 కిలోమీటర్లు

ఇదే భాగంగా, చైనా ఇప్పటికే CR450 బుల్లెట్ రైలును కూడా పరిచయం చేసింది. ఇది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Show Full Article
Print Article
Next Story
More Stories