వుహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత.. ఒక్కసారిగా 65వేల మంది..

వుహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత.. ఒక్కసారిగా 65వేల మంది..
x
China
Highlights

గత ఏడాది చివర్లో ఉద్భవించిన కరోనావైరస్ కారణంగా 76 రోజుల క్రితం మధ్య చైనా నగరాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

గత ఏడాది చివర్లో ఉద్భవించిన కరోనావైరస్ కారణంగా 76 రోజుల క్రితం మధ్య చైనా నగరాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇన్ని రోజుల లాక్ డౌన్ అనంతరం మొదటిసారి వుహాన్ ప్రజలను బుధవారం ప్రయాణాలకు అనుమతించారు. దీంతో ఆంక్షలు ఎత్తివేసిన గంటల్లోనే 65,000 మందికి పైగా ప్రజలు ప్రయాణాలు చేశారు. బుధవారం తెల్లవారుజామున వుహాన్ నుండి బయలుదేరిన రైళ్లను క్యాచ్ చెయ్యడానికి వేలాది మంది ప్రయాణికులు తరలివచ్చారు. అర్ధరాత్రి లాక్ డౌన్ నిషేధాన్ని తొలగించారు అధికారులు. ఈ విషయం అప్పటికే చాలా మందికి తెలిసింది.

దాంతో ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఇర్రుక్కుపోయిన వారు తమ స్వస్థలాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు పరిమితమైన రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వుహాన్ నగరంలోని వుచాంగ్ స్టేషన్‌లోకి భారీగా జనం ప్రవేశించారు. అంతేకాదు ఒక్కసారిగా వేలాది మంది జనం ఒక్కసారిగా రోడ్లమీదకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ట్రాఫిక్ అధికారులు అదనంగా చాలా సేపు డ్యూటీ చెయ్యవలసి వచ్చింది. మరోవైపు కరోనావైరస్ మరణాలు, అలాగే మొత్తం కేసులు కొత్తవేమీ నమోదు కాలేదని అధికారిక జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.

అంతేకాదు గత 24 గంటల్లో కొత్త మరణాలు ఏవీ నమోదు కాలేదని జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం తెలిపింది. జనవరిలో చైనా గణాంకాలను ప్రచురించడం ప్రారంభించిన తరువాత ఇది మొదటి మరణ-రహిత రోజుగా చైనా అభివర్ణించింది. మొత్తం 81,000 కంటే ఎక్కువ అంటువ్యాధులు అలాగే 3,300 మందికి పైగా మరణించినట్లు చైనా అధికారికంగా పేర్కొంది.. వాటిలో కూడా ఎక్కువ భాగం హుబే ప్రావిన్స్ లోనే సంభవించాయి.. చైనా వ్యాధుల నియంత్రణ అధికారులు జనవరిలో వూహాన్ మార్కెట్లో వన్యప్రాణుల నుండి మానవులకు ఈ వైరస్ సోకిందని చెప్పిన సంగతి తెలిసిందే, ఈ ప్రాంతం అనేక అడవి జంతువుల మాంసం విక్రయాలకు కేంద్రంగా ఉందని వారు తెలిపారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా, వైరస్ నిర్ధారణ అయిన వారి సంఖ్య ఇప్పుడు 1.4 మిలియన్లను దాటిపోయింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సమాచారం ప్రకారం 81,500 మందికి పైగా మరణించారు, 300,000 మందికి పైగా కోలుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories