China vs America: దెబ్బకు దెబ్బ.. చైనా దెబ్బకు ట్రంప్‌ మావ అబ్బా.. వాటే రియాక్షన్‌ జిన్‌పింగ్‌ అంకుల్!

China vs America
x

China vs America: దెబ్బకు దెబ్బ.. చైనా దెబ్బకు ట్రంప్‌ మావ అబ్బా.. వాటే రియాక్షన్‌ జిన్‌పింగ్‌ అంకుల్!

Highlights

China vs America: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వాణిజ్య యుద్ధ మేఘాల్లోకి వెళ్తోంది. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు స్ట్రాటజిక్ లోహాలు, ఇక దిగుమతి నిబంధనలు అన్నీ కలిపి అమెరికా-చైనా సంబంధాలు మరోసారి ఘర్షణ దిశగా వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

China vs America: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ టారిఫ్‌లను అమలు చేస్తామని ప్రకటించిన వెంటనే, చైనా కూడా ఎదురుదెబ్బ పడింది. ఏప్రిల్ 10 నుంచి అమెరికా వస్తువులపై అదనంగా 34 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వేదికలపై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ టారిఫ్‌తో పాటు, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మిడియం, భారీ తరహా రెయర్‌ ఎర్త్ ఎలిమెంట్స్‌పై ఎగుమతి నియంత్రణలు అమలు చేయనుంది. ఇందులో గాడోలినియం, టెర్బియం, డైస్ప్రోసియం, లూటేటియం, స్కాండియమ్, ఇట్రియమ్ లాంటి విలువైన లోహాలపై ఎగుమతులకు ఆంక్షలు విధించనున్నారు. ఈ పరిమితులు ఏప్రిల్ 4 నుంచే అమలులోకి వస్తాయి.

చైనా ఈ నిర్ణయాన్ని జస్టిఫై చేస్తూ, తమ దేశ భద్రతా ప్రయోజనాల కోసం అంతర్జాతీయ ఒప్పందాలపరంగా బాధ్యత నెరవేర్చడానికే ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, 11 విదేశీ కంపెనీలను 'అన్‌ఎలియబుల్ ఎంటిటీ' జాబితాలో చేర్చింది. దీనిద్వారా చైనా ప్రభుత్వం ఇకపై ఆ సంస్థలపై శిక్షా చర్యలు తీసుకునే వీలుంది. అయితే టారిఫ్‌లపై చిన్న గడువు కూడా కల్పించింది చైనా. ఏప్రిల్ 10 ముందు షిప్ అయిన సరుకు, మే 13 లోపు దిగుమతి అయినట్లయితే, వాటిపై అదనపు సుంకాలు వర్తించవని చైనా స్టేట్ కౌన్సిల్ తెలిపింది.

ఇక ఈ చర్యలన్నీ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలకి ప్రతిస్పందనగానే జరిగాయి. ట్రంప్ తాజా ప్రకటనలతో చైనా వస్తువులపై మొత్తం 54 శాతం టారిఫ్‌లు అమలయ్యేలా మారింది. ఇది అతని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన 60 శాతం టారిఫ్‌ లక్ష్యానికి చేరువగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories