Coronavirus: మృతులు 15వందలకు పైగానే.. అందులో ఆరుగురు వైద్య సిబ్బంది

Coronavirus: మృతులు 15వందలకు పైగానే.. అందులో ఆరుగురు వైద్య సిబ్బంది
x
Highlights

చైనాలో ప్రమాదకర కోవిడ్‌–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. వైరస్...

చైనాలో ప్రమాదకర కోవిడ్‌–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న హుబే ప్రావిన్స్ ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 121 మంది చనిపోయారు. చైనాలోని మొత్తం 31 ప్రావిన్స్‌ల్లో మరో 5,090 కేసులు కొత్తగా బయటపడగా వీటిలో 4,823 కేసులు వ్యాధి మూలాలు మొదట గుర్తించిన హుబే ప్రావిన్స్‌లోనివే. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 64,894కు చేరుకుంది. అలాగే, కోవిడ్‌ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్‌ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించడం సంచలనంగా మారింది.

వైద్యులలో చాలా మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి.. అందులో హుబీ రాజధాని వుహాన్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది, ఇక్కడ చాలా మంది రోగుల వరదతో ఆసుపత్రులలో తమను తాము రక్షించుకోవడానికి సరైన మాస్కులు, ఆరోగ్య పరికరాలు లేకపోవడం ఆందోళనకరంగా మారింది. శుక్రవారం హుబేలో 4,800 కేసులు, శనివారం 2,420 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య హుబే వెలుపల క్రమంగా తగ్గిపోతున్నట్టు చైనా వైద్య అధికారులు తెలిపారు. శనివారం 221 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని.. వారిని కూడా ఐసోలేషన్ కు తరలించినట్టు తెలిపింది. ఇక 56 మిలియన్ల మంది ప్రజలను హుబైలో నిర్బంధంలో ఉంచారు చైనా అధికారులు. పాఠశాలలు దేశవ్యాప్తంగా మూసివేయబడ్డాయి.. చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ప్రోత్సహించాయి.

కేసులను లెక్కించడానికి హుబీలోని అధికారులు ప్రమాణాలను మార్చడంతో , ఈ వారంలో అంటువ్యాధి స్థాయి పెరిగింది. మరోవైపు కోవిడ్‌–19 వైరస్‌ అనుమానంతో జపాన్‌ తీరంలో నిలిపేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్ షిప్ లో 3,711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, 7 గురు ప్రయాణికులున్నారు.

అయితే వీరిని భారత్ కు తీసుకురావడానికి సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. కాగా భారత్ లో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ తెలిపారు. చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారని ఆమె స్పష్టం చేశారు. వైరస్ పై అనవసరంగా పుకార్లు వ్యాప్తి చెయ్యొద్దని ఆమె సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories