Coronavirus : మంగళవారం నాటికి మరణాల సంఖ్య ఎంతంటే..

Coronavirus : మంగళవారం నాటికి మరణాల సంఖ్య ఎంతంటే..
x
Highlights

చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం నాటికి మొత్తం 1,868 మంది ఈ వైరస్ భారిన పడి మరణించారు. అలాగే నిన్న...

చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం నాటికి మొత్తం 1,868 మంది ఈ వైరస్ భారిన పడి మరణించారు. అలాగే నిన్న ఒక్కరోజే 98 మరణాలను సంభవించాయి, ఇందులో 90 శాతం హుబే ప్రావిన్స్ లోనే నమోదయ్యాయి. ఇక మంగళవారం 1,886 కొత్త వైరస్ కేసులు నమోదుకాగా.. అవి దాదాపు సాధారణమేనని చైనా ఆరోగ్య శాఖ తేల్చింది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నా.. మరణాల సంఖ్య ఆందోళన కలిగించే అంశమే.. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా తేలికపాటివని, ఈ నెల మొదటినుంచి కొత్త కేసులు క్రమంగా పడిపోతున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక చైనాలో మంగళవారం నాటికి మొత్తం 72,436 కేసులు నమోదయ్యాయి.

చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి సోమవారం వచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ప్రకటన చేసింది.. వైరస్ వ్యాప్తికి స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది, ఇది ఎలా అభివృద్ధి చెందుతోంది మరియు ఎక్కడికి వెళుతుంది" అనే అంశంపై ప్రయోగాలు జరుపుతున్నట్టు WHO డైరెక్టర్ జనరల్ ఒక వార్తా సమావేశంలో చెప్పారు. కాగా ఫిబ్రవరి 11 నాటికి చైనాలో 44,672 కేసులను ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. అందులో 14% న్యుమోనియా మరియు 5 శాతం తీవ్రమైన అనారోగ్యం వంటి లక్షణాలను కలిగివున్నారు. గతవారం రిపోర్ట్ రావాల్సి ఉంది.

మరోవైపు జపాన్ లో చిక్కుకున్న డైమండ్ ప్రిన్సెస్‌ లో మరో 99 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చినట్టు జపాన్ అధికారులు సోమవారం ధ్రువీకరించారు, దీంతో మొత్తం 454 కు చేరుకుంది. తాజాగా ఓడలో 1,723 మందిని పరీక్షించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా COVID-19 అని పిలువబడే ఈ కొత్త వైరస్ డిసెంబరులో మధ్య చైనాలోని హుబీ ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో ఉద్భవించింది.. రెండు డజనుకు పైగా ఇతర దేశాలకు వ్యాపించింది. చైనాలో వ్యాధి వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో మార్చిలో జరగాల్సిన తన వార్షిక అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న సమావేశాన్ని వాయిదా వేయడంపై ఫిబ్రవరి 24 న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories