కరోనా వ్యాప్తి తగ్గడంతో చైనా కీలక నిర్ణయం..

కరోనా వ్యాప్తి తగ్గడంతో చైనా కీలక నిర్ణయం..
x
Highlights

కరోనావైరస్ మహమ్మారి చైనా నుంచి ఉద్భవించిన సంగతి తెలిసిందే.

కరోనావైరస్ మహమ్మారి చైనా నుంచి ఉద్భవించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆ దేశంలో 80 వేల మందికి పైగా ఆసుపత్రిపాలయ్యారు. అంతేకాదు 3 వేల మందికి పైగా మరణించారు. చైనాలో నెలకు పైగా లాక్ డౌన్ కోసాగింది. దాంతో అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేయబడ్డాయి.. ఈ క్రమంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వార్తా సంస్థ జిన్హువా ప్రకారం, ఇప్పుడు చైనాలో పర్యాటక ప్రదేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయయించింది. చైనా గోడతో సహా 73 పర్యాటక ప్రదేశాలు బీజింగ్‌లో ప్రారంభించబడ్డాయి. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక అధికారి ప్రకారం, 30% పర్యాటకులు ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించడానికి అనుమతి ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇదిలావుండగా, దేశంలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. ఇందులో దేశీయ సంబంధాల వల్ల నాలుగు కేసులు వచ్చాయని జాతీయ ఆరోగ్య కమిషన్ నివేదించింది. వాటిలో మూడు హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్ నుండి మరియు ఒకటి మంగోలియా అటానమస్ రీజియన్ నుండి వచ్చాయి. మరో ఎనిమిది కేసులు బయటి నుండి వచ్చాయని.. చైనాలో ఆదివారం మరణాలు ఏవి సంభవించలేదని తెలియజేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories