ప్రత్యేక విమానాల్లో భారత్‌ నుంచి చైనాకు..

ప్రత్యేక విమానాల్లో భారత్‌ నుంచి చైనాకు..
x
Highlights

భారత్ లో వ్యాప్తి చెందుతున్న కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో భారతదేశంలో చిక్కుకున్న తన తన పౌరులను తరలించాలని చైనా యోచిస్తున్నట్లు ఢిల్లీలోని చైనా...

భారత్ లో వ్యాప్తి చెందుతున్న కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో భారతదేశంలో చిక్కుకున్న తన తన పౌరులను తరలించాలని చైనా యోచిస్తున్నట్లు ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం సోమవారం విడుదల చేసిన నోటీసులో పేర్కొంది. భారతదేశంలో చిక్కుకుపోయిన విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను ప్రత్యేక విమానాలలో చైనాకు తిరిగి తీసుకు వెళ్లడానికి అనుమతిస్తామని ఎంబసీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం భారతదేశంలో చదువుతున్న లేదా బస చేస్తున్న, అలాగే పనిచేస్తున్న చైనా పౌరుల సంఖ్య వెంటనే అందుబాటులో లేకున్నా.. మే 27 ఉదయం నాటికి చైనాకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండాలని కోరింది.

ఇందులో యోగా సాధన కోసం భారతదేశంలో ఉన్నవారు అలాగే బౌద్ధ మత ప్రచారం కోసం భారతదేశానికి వచ్చిన చైనా పౌరులు కూడా ఉన్నారు. అయితే వీరికోసం ప్రత్యేక విమానాలు ఎప్పుడు, ఎక్కడి నుండి బయలుదేరతాయో మాత్రం పేర్కొనలేదు. సోమవారం ఉదయం మాండరిన్‌లో ఉంచిన నోటీసులో, విమానాల టిక్కెట్ల కోసం డబ్బులు సొంతంగానే చెల్లించాల్సి ఉంటుందని, వారు చైనాలో అడుగుపెట్టిన తర్వాత వారి 14 రోజుల దిగ్బంధం కోసం కూడా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో చైనా నుంచి తరలింపు నోటీసు రావడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories