Coronavirus: తొలిసారిగా ఆ దేశాల్లో కరోనాకేసులు నమోదు.. పెరిగిన మృతుల సంఖ్య

Coronavirus: తొలిసారిగా ఆ దేశాల్లో కరోనాకేసులు నమోదు.. పెరిగిన మృతుల సంఖ్య
x
Highlights

చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆగడం లేదు. ఇప్పటివరకు 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. మరోవైపు ఒక్క...

చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆగడం లేదు. ఇప్పటివరకు 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. మరోవైపు ఒక్క మంగళవారం కొత్తగా 406 కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ బుధవారం తెలిపింది. దీంతో ఆ దేశంలో 77 వేలకుపైగా మంది ఈ వైరస్ బారినపడ్డారు. మంగళవారం చివరి నాటికి మరణించిన వారి సంఖ్య 2,715 కు పెరిగిందని, అంతకుముందు రోజుతో పోలిస్తే 52 శాతం పెరిగిందని కమిషన్ తెలిపింది. వ్యాప్తికి కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రావిన్స్ హుబీ ఫిబ్రవరి 25 న 401 కొత్త కేసులను నివేదించింది.

కాగా యూరోప్, మిడిల్ ఈస్ట్ సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కరోనావైరస్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది.. చైనా కాకుండా దాదాపు 30 ఇతర దేశాల్లో 1200 దాకా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 20 మంది మరణించారు.. ఇటలీలో కరోనావైరస్ వల్ల సోమవారం నలుగురు మరణించారు. మొత్తంగా ఆ దేశంలో ఆ కరోనా సోకి ప్రాణాలు వదిలినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఇక 11 వ వ్యక్తి ఈ వ్యాధితో మరణించినట్లు దక్షిణ కొరియా బుధవారం తెలిపింది.. కొత్తగా 169 కరోనావైరస్ కేసులను నిర్ధారించబడిన తరువాత దేశంలో ఇప్పుడు కనీసం 1,146 కరోనావైరస్ కేసులు ఉన్నాయి, వాటిలో ఎక్కువ భాగం డేగు నగరంలో మరియు చుట్టుపక్కల ఉన్నాయి.

ఇరాన్‌లో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 61 కరోనాకేసులు నమోదయ్యాయి. ఖూమ్ నగరంలో 50 మంది మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచి పెడుతోందని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా, కనీసం 80,000 మందికి ఈ వైరస్ భారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఇదిలావుంటే సోమవారం ఇరాక్, అఫ్గానిస్తాన్, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌ల్లో తొలి సారిగా కరోనాకేసులు నమోదయ్యాయి. బాధితులంతా ఇరాన్ నుంచి వచ్చినవారే. తమ దేశంలో కరోనావైరస్ సోకిన వ్యక్తి ఓ స్కూల్ బస్ డ్రైవర్‌ అని, ఫలితంగా చాలా పాఠశాలలు మూసేశామని బహ్రెయిన్ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories