China: 59 మొబైల్ యాప్‌ల నిషేధానికి చైనా ప్రతీకారం

China: 59 మొబైల్ యాప్‌ల నిషేధానికి చైనా ప్రతీకారం
x
Highlights

China: గాల్వన్ వ్యాలీలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంట భారత సైన్యం, చైనా బలగాలు మధ్య హింసాత్మక ఘటన నేపథ్యంలో.

China: గాల్వన్ వ్యాలీలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంట భారత సైన్యం, చైనా బలగాలు మధ్య హింసాత్మక ఘటన నేపథ్యంలో.. చైనాకు చెందిన 59 మొబైల్ ఫోన్ యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు ప్రతీకారంగా జి జిన్‌పింగ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చైనాలోని ప్రధాన భూభాగంలో WION వెబ్‌సైట్.. www.wionews.com ను బ్లాక్ చేసింది. ఈ విషయాన్నీ చైనా ఇంటర్నెట్ పర్యవేక్షణ వాచ్‌డాగ్ అయిన GreatFire.org ధృవీకరించింది. చైనాలో WION ను పూర్తిగా నిరోధించబడిందని పేర్కొంది. కాగా GreatFire.org సంస్థ చైనాలోనే కాక అంతర్జాతీయ వార్తా సంస్థలలో ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ కోసం ఒక డేటాబేస్‌గా అవతరించింది. పరిశోధకులు దీనిని డిజిటల్ సెన్సార్‌షిప్‌ను తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

WION న్యూస్ ఏజన్సీ.. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభ దశనుండి.. చైనాలో కప్పిపుచ్చే ధోరణిపై కథనాలను రాస్తూనే ఉంది. అక్కడ వైరస్ వ్యాప్తి గురించి విస్తృతంగా నివేదించింది.. దాంతో జిన్‌పింగ్ప్ర భుత్వం WION పట్ల పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మార్చిలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌ ద్వారా WION పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు భారతదేశంలో చైనా దౌత్యవేత్తలు కూడా మహమ్మారి విషయంలో WION కథనాలను తప్పుబట్టారు. కాగా WION అనేది ఇండియాలోని ఆంగ్ల భాషా వార్తల ఆధారిత టెలివిజన్ ఛానల్, ఇది ఎస్సెల్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది.. జీ మీడియా నెట్‌వర్క్‌లో ఒక భాగం. ఈ ఛానెల్ ముఖ్యగా ప్రపంచ వార్తలు, సమస్యలను నివేదిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories