Coronavirus: దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

Coronavirus: దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?
x
mosquito
Highlights

ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి...

ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ 125 దేశాలకు పైగా వ్యాపించింది. అయితే ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి మాత్రం శరవేగంగా విస్తరిస్తోంది.

ఇక తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దోమకాటుతో కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో లేనిపోని అపోహలు కలుగుతున్నాయి. దోమకాటు ద్వారా కొవిడ్‌-19 వైరస్‌ వ్యాపిస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అపోహను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. మందు తాగడంవల్ల, వెల్లుల్లి తినడంవల్ల కరోనా రాకుండా అడ్డుకోలేమని తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories