నాలుగో పెళ్లి చేసుకుంటున్నారా.. కళ్యాణ మండపం ఫ్రీ..!

నాలుగో పెళ్లి చేసుకుంటున్నారా.. కళ్యాణ మండపం ఫ్రీ..!
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

నిత్య పెళ్లి కొడుకుల కోసం ఓ కళ్యాణ మండపం నిర్వాహకులు బంపర్ ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఆ ఆఫర్లు మొదటి పెళ్లి చేసుకునే వారి వర్తించవంట. రెండో పెళ్లి నుంచి...

నిత్య పెళ్లి కొడుకుల కోసం ఓ కళ్యాణ మండపం నిర్వాహకులు బంపర్ ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఆ ఆఫర్లు మొదటి పెళ్లి చేసుకునే వారి వర్తించవంట. రెండో పెళ్లి నుంచి మొదలుకుని ఆపై ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఈ ఆఫర్లను ఇస్తాం అంటున్నారు మండపం నిర్వహకులు. అబ్బ ఈ ఆఫర్ ఏదో బాగుందే, ఇంతకీ ఏమిటీ ఆ ఆఫర్? ఓసారి ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే దీన్ని ట్రై చేయాలనుకున్నవారు వెంటనే పాకిస్థాన్‌కు బయల్దేరాల్సిందే.

పూర్తి వివరాల్లోకెళితే పాకిస్తాన్ బహవాల్పూర్ లోని కొత్త వెడ్డింగ్ హాల్ నిర్వహకులు వారి మండపంలో రెండో పెళ్లి చేసుకొనేవారికి 50 శాతం, మూడో పెళ్లి చేసుకొనేవారికి 75 శాతం రాయితీ ఇస్తోంది. ఇక నాలుగో పెళ్లి చేసుకోవాలనుకే వారికి ఏకంగా పూర్తి ఉచితంగా కళ్యాణ మండపాన్ని వాడుకోవచ్చని ప్రకటించింది. అంతే కాదు "దమ్ హై తో మైదాన్ మెయిన్ ఆవో. దూస్రీ షాదీ కర్కే దిఖావో" అని క్యాప్షన్ కూడా పెట్టారు.

దీంతో పాకిస్తాన్ లోని ఓ టీవీ చానల్ వాళ‌్లు మండపం నిర్వహకుల దగ్గర ఇంటర్వూ తీసుకున్నారు. ఎందుకు ఇలాంటి ఆఫర్లు పెడుతున్నారని ప్రశ్నిస్తే ''ఈ కళ్యాణ మండపాన్ని కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పుడూ కొత్త జంటలకు మాత్రమే పెళ్లి చేసుకోడానికి ఆఫర్లు ఇస్తున్నారు కానీ, మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకొనేవారికి ఎందుకు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశాం అని తెలిపారు.

అంతే కాదు ఈ విధంగా పెళ్లిలు చేసుకోవాలనుకున్న వారికి కొన్ని షరతులు కూడా విధించారు. పెళ్లి మండపాన్ని వరుడు బుక్ చేయడానికి వీలులేదన్నారు. పెళ్లి కొడుకు మాజీ భార్య అంగీకారంతోనే ఆమెనే పెళ్లి మండపాన్ని బుక్ చేయాలని తెలిపారు. ఆఫర్‌లో పెళ్లి మండపం వస్తుంది కదా అని భార్యకు ఇష్టం లేకుండా విడాకులిచ్చి మరీ పెళ్లికి సిద్ధమయితే ఈ ఆఫర్ వర్తించదన్నారు.

ఇక ఈ ఇంటర్వూ పూర్తయిన తరువాత నైలా ఇనాయత్ అనే రిపోర్టర్ ఈ ఫన్నీ ప్రకటనను తన ట్వీటర్ లో ట్వీట్ చేసింది. వెంటనే ఈ ఫన్నీ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారి నెటిజన్ల ఫోన్లలో చెక్కర్లు కొడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories