కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్?

కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్?
x
Highlights

కరోనా కొరకరాని కొయ్యలా మారింది ప్రపంచానికి. అసలు ఒక చిన్న వైరస్ ఎన్ని వేషాలు వేయాలో అన్నీ వేసి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

కరోనా కొరకరాని కొయ్యలా మారింది ప్రపంచానికి. అసలు ఒక చిన్న వైరస్ ఎన్ని వేషాలు వేయాలో అన్నీ వేసి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.రోజుకో రకమైన వార్త కరోన గురించి వ్యాప్తిలోకి వస్తోంది. ఇందులో నిజాలు.. వాటి శాతాలు మాట పక్కన పెడితే.. ఒక్కో విషయం వింటే భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అటువంటిదే ఒక విషయాన్ని తాజాగా కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. ఇంతవరకూ కరోనా కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే, కరోనా బారిన పడిన యువతలో భవిష్యత్ లో మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

బ్రెయిన్ స్ట్రోక్ అనేది సాధారణంగా వృద్ధుల్లో వస్తుంది. అయితే, కరోనా వైరస్ వలన 30, 40 ఏళ్ల వయసు వారిలోనూ ఈ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఆ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా సాధారణ రోగుల్లో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్స్ కంటే కరోనా కారణంగా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్స్ భిన్నంగా ఉన్నాయని పాస్కల్ జాబర్ అనే పరిశోధకుడు వెల్లడించారు.

30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసున్న కొందరిపై అధ్యయనం చేపట్టగా, వారిలో భారీ స్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్స్ కనిపించాయని, వారి వయసును పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇది చాలా అసాధారణ అంశం అని వివరించారు. 14 మందిపై పరిశీలన జరుపగా, వారిలో చాలామందికి తాము కరోనా బారినపడ్డామని తెలియదని, తమవద్దకు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వచ్చారని, కానీ తాము వైద్యపరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని జాబర్ తెలిపారు. మెదడుకు రక్త సరఫరాను నియంత్రించే ఏస్2 రెసిప్టార్ పై కరోనా వైరస్ ప్రభావం చూపుతుండడం వల్లే ఇలా జరిగే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ విషయం నిజంగా ఆందోళన కలిగించేదిగానే కనిపిస్తోంది. దీనిమీద మరింత పరిశోధనలు జరిగితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా కరోనా వైరస్ వల్ల దుష్ఫలితాలు చాలా రకాలుగా ఉండొచ్చనే విషయం మాత్రం అర్థం అవుతోంది. అందుకే ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం చాలా అవసరమని చెప్పొచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories