మరో ఆసక్తికర స్పేస్ టూర్‌కు రంగం సిద్ధం.. ఈరోజే అపరకుబేరుడు..

Blue Origin Spaceflight Launch Today: Jeff Bezos is Going to Space
x

మరో ఆసక్తికర స్పేస్ టూర్‌కు రంగం సిద్ధం.. ఈరోజే అపరకుబేరుడు..

Highlights

Jeff Bezos: మరో ఆసక్తికర ప్సేస్ టూర్‌కు రంగం సిద్ధమైంది.

Jeff Bezos: మరో ఆసక్తికర ప్సేస్ టూర్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ అపరకుబేరుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యానం చేయనున్నారు. బెజోస్‌తో పాటు మరో ముగ్గురు ప్సేస్‌లోకి దూసుకెళ్లనున్నారు. బెజోస్ సోదరుడితో పాటు అత్యంత ఎక్కువ వయసుల్లో అంతరిక్షయాత్ర చేయబోతున్న మాజీ పైలట్ వాలీ ఫంక్‌ ఒకరు కాగా మరో 18ఏళ్ల వ్యక్తి ఆలివర్ డెమెన్ అత్యంత చిన్న వయసులో ప్సేస్‌లోకి దూసుకెళ్లనున్న వ్యక్తిగా రికార్డులు సృష్టించనున్నారు. డెమెన్ 209కోట్లతో ఈ ప్రతిష్టాత్మక టూర్‌లో సీటు దక్కించుకున్నారు.

మరోవైపు బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ తయారు చేసిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాప్ట్‌లో ఈ నలుగురు అంతరిక్ష యాత్ర చేయనున్నారు. వ్యోమగాములు, పరిశోధకులు, శాస్త్రవేత్తలే కాకుండా మామూలు మనుషులకు కూడా అంతరిక్ష యాత్రలను దగ్గర చేయడమే ముఖ్య ఉద్దేశంగా బెజోస్‌ ఈ యాత్రను తలపెట్టారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఇటీవల అంతరిక్ష యాత్ర చేసినప్పుడు కర్మన్‌ లైన్ దాటలేదని, కర్మన్‌ లైన్‌ దాటితేనే అంతరిక్ష యాత్ర అని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెజోస్‌ బృందం 100 కిలోమీటర్ల కర్మన్‌ లైన్‌ను దాటి రానున్నారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక స్పేస్ టూర్‌ ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభం కానుంది. అమెరికాలోని టెక్సాస్ నుంచి న్యూ షెపర్డ్ స్పేస్ క్రాప్ట్‌ రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఇది అటానమస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కావడంతో దీనిలో పైలట్‌ ఉండరు. పూర్తి ఆటోమెటిక్‌గా నడిచే న్యూ షెపర్డ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో మనుషులు ప్రయాణించడం కూడా ఇదే తొలిసారి. గతంలో ట్రయల్స్‌ నిర్వహించినప్పటికీ ఆ సమయంలో మనుషులు ప్రయాణించలేదు. దీంతో జెఫ్ బెజోస్ స్పేస్ టూర్ సరికొత్త రికార్డులకు వేదిక కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories