గుడ్ న్యూస్ : కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన అమెరికా సంస్థ

గుడ్ న్యూస్ : కరోనాకు  వ్యాక్సిన్ కనిపెట్టిన అమెరికా సంస్థ
x
Moderna
Highlights

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి కరోనావైరస్ .. ఇప్పటికి ఈ వ్యాధి బారినా పడి వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. గత కొద్దిరోజుల...

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి కరోనావైరస్ .. ఇప్పటికి ఈ వ్యాధి బారినా పడి వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. గత కొద్దిరోజుల క్రితం వరకు కేవలం చైనాకు మాత్రమే పరిమితం అయిన ఈ వ్యాధి ఇప్పుడు ఇతర దేశాలకు కూడా వ్యాపించి ప్రజల గుండెల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఈ వ్యాధికి మెడిసిన్ కనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు మొదటినుంచి తీవ్రంగా గానే కృషి చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా ప్రకటించింది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌‌ను మనుషులపై ప్రయోగించడానికి సిద్ధం చేశామని సదరు సంస్థ తెలిపింది. ప్రయోగాల కోసం ఈ వ్యాక్సిన్‌ను అమెరికా ప్రభుత్వ పరిశోధకులకు పంపామని, ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్‌‌ తొలి బ్యాచ్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్‌కు పంపినట్లు మోడెర్నా తెలిపింది. ముందుగా దీనిని కొద్ది మంది ఆరోగ్యవంతులపై తొలి ప్రయోగం చేపడతామని, విజయవంతం అయితే అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యి, అనుమతులు వచ్చే సరికి కనీసం ఏడాది పట్టే ఛాన్స్ ఉంది.

2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్‌ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80,000 మందికి ఈ వ్యాధి సోకినట్టుగా సమాచారం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories