Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ యువకుడిని కిరాతకంగా చంపిన దుండగులు..

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ యువకుడిని కిరాతకంగా చంపిన దుండగులు..
x
Highlights

Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మరోసారి హింస చెలరేగింది.

Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మరోసారి హింస చెలరేగింది. మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అత్యంత కిరాతకంగా హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 'చంపారా టీ గార్డెన్'లో కార్మికుడిగా పనిచేస్తున్న రతన్ శుభోకర్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే రతన్ శుభోకర్ మృతదేహం తోటలో విగతజీవిగా కనిపించింది. స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయని, శరీరంపై తీవ్రమైన గాయాలు, రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి నుంచి రతన్ కనిపించకుండా పోయాడని మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌లో ఎన్నికల సమయంలో హిందూ మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలకు ఈ ఘటన బలం చేకూరుస్తోంది.

గత జనవరిలోనే జైలు కస్టడీలో అవామీ లీగ్ నేత రమేష్ చంద్ర సేన్, సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి వంటి ప్రముఖులతో సహా సుమారు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది.

డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత చెలరేగిన అల్లర్లలో ఇప్పటికే పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు.

తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలపై హామీలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరగడం పట్ల మైనారిటీ వర్గాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎన్నికల వేళ ఉద్రిక్తతలు పెరగకుండా విచారణను వేగవంతం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories