Pakistan train Hijacked: పాకిస్థాన్ రైలుపై మిలిటెంట్స్ దాడి... 400 మంది ప్రయాణికుల అపహరణ?

Baloch Liberation Army Hijack Jaffar Express Train In Pakistan and took over 100 passengers as hostages
x

Pakistan train: పాకిస్థాన్ రైలుపై మిలిటెంట్స్ దాడి... 400 మంది ప్రయాణికుల అపహరణ!

Highlights

BLA Militants attack on Pakistan train: క్వెట్టా నుండి పెషావర్ బయల్దేరిన రైలుపై ఉగ్రవాదులు దాడి...

Pakistan train: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై ఉగ్రవాదులు దాడి చేసి రైలులోని ప్రయాణికులను హైజాక్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు అందరినీ ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్‌కు దిగితే... తమ వద్ద ఉన్న బందీలను చంపేస్తామని బెదిరిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది.

బలుచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును మిలిటెంట్స్ మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు. తమ రైలు పట్టాలను పేల్చేయడం ద్వారా రైలు ఆగేలా చేసి ఈ హైజాక్‌ను సక్సెస్ చేశారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ప్రకటనలో పేర్కొంది.

క్వెట్టా నుండి పెషావర్ బయల్దేరిన రైలును మార్గం మధ్యలోనే మిలిటెంట్స్ అడ్డుకున్నారన్న వార్తలపై బలుచిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. బలుచిస్తాన్ అధికార ప్రతినిధి షాహీద్ రింద్ స్పందిస్తూ అన్ని భద్రతా విభాగాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అప్‌డేట్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories