ఆస్ట్రేలియాలో మళ్లీ లాక్‌డౌన్‌

Australia Honey Bees put in Lockdown
x

ఆస్ట్రేలియాలో మళ్లీ లాక్‌డౌన్‌

Highlights

Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది.

Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. న్యూ సౌత్‌వేల్స్‌ అధికారులను అప్రమత్తం చేసింది. లాక్‌డౌన్‌ అనగానే వ్యూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ విజృంభించిందని మీరు ఊహిస్తే పప్పులో కాలేసినట్టే. అయితే ఆస్ట్రేలియాలో విధించిన లాక్‌డౌన్‌ కథ వేరు. ఆ దేశంలోని తేనెటీగల కోసమే తాజాగా లాక్‌డౌన్ విధించింది. వరోవా అనే పరాన్న జీవుల కారణంగా కంగారూ దేశంలో తేనెటీగలు మొత్తం చనిపోతున్నాయి. దీంతో వాటిని రక్షించుకునేందుకు అక్కడి ప్రభుత్వం తేనెటీగల కోసం లాక్‌డౌన్ విధించింది.

లాక్‌డౌన్‌ ఈ మాట వినగానే మనకు టక్కున గుర్తొచ్చేది కరోనా వైరస్.. 21వ శాతబ్దంలో అత్యంత భయానకమైన పరిస్థితులను కరోనా వైరస్ సృష్టించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు అన్నింటిని మూసేశాయి. ఈ పరిస్థితినే మనం లాక్‌డౌన్‌ అంటాం ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం న్యూ సౌత్‌వేల్స్‌లోని అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే లాక్‌డౌన్‌ ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ అనేగానే అక్కడ కూడా మహమ్మారి కరోనా విజృంభించిందేమో అనే ఆలోచన మనకు వెంటనే వస్తుంది. అలా ఊహిస్తే.. మనం పప్పులో కాలేసినట్టే ఆస్ట్రేలియాలో పరిస్థితి వేరు. ఆ దేశంలోని తేనెటీగలు దారుణంగా చనిపోతున్నాయి. దీంతో తేనెటీగలను రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అసలు అక్కడి తేనెటీగలు ఎందుకు చనిపోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వరోవా పరాన్న జీవులు.. నువ్వు గింజ పరిణామంలో ఉండే కీటకాలు ఇవి తెనే పట్లకు వ్యాపించి తేనెటీగలను నాశనం చేస్తాయి. ఒక రకమైన వైరస్‌ను వ్యాపింపజేస్తాయి. తాజాగా న్యూ సౌత్‌వేల్స్‌లో ఏడు ప్రాంతాల్లో వరోవా జీవులను గుర్తించారు. దీంతో వాటి వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు పలు రకాల బయో సెక్యురిటీ చర్యలను చేపట్టారు. వరోవా సోకిన ప్రాంతాల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేనెపట్లను నాశనం చేస్తాయి. ఇప్పటివరకు న్యూ సౌత్‌వేల్స్‌లో 400 తేనెపట్లలో ఈ వరోవా జీవులను గుర్తించారు. సాధారణంగా ప్రపంచ దేశాల్లో వరోవా జీవులు ఉన్నా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో మాత్రం గుర్తించలేదు. దీంతో ఇప్పుడు కంగారూ దేశంలో ఆందోళన మొదలయ్యింది. వరోవా వ్యాప్తి చెందితే తేనె, ఆహార ఉత్పత్తి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే తేనెటీగల రక్షణ కోసం కొత్త బయోసెక్యూరిటీ జోన్‌ను అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు.

వరోవా కీటకాలు పరాన్న జీవులు ఆస్ట్రేలియాలోని మొత్తం తేనెటీగలను నాశనం చేస్తాయని అక్కడి తేనె ఉత్పత్తి పరిశ్రమపై ఆధారపడినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తేనెటీగల లాక్‌డౌన్‌ను అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో తేనెటీగలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించకుండా ఉంటాయి. వరోవా కారణంగా తేనెటీగలకు సోకిన వైరస్‌ మరో ప్రాంతానికి వ్యాపించకుండా అడ్డుకుంటారు. వరోవా వ్యాప్తి చెందితే తేనె ఉత్ప్తి పరిశ్రమ 7 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతుంది. మన రూపాయిల్లో చెప్పుకుంటే.. 553 కోట్ల మేర తేనె ఉత్పత్తి పరిశ్రమ నష్టపోతుంది. ఆస్ట్రేలియా ఆహార ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు తేనెటీగల పరాగసంపర్కంపై ఆధారపడి ఉంటుంది. తేనెటీగలు లేకపోతే బాదం, యాపిల్స్‌, అవకాడో వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అక్కడి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా మొత్తం తేనె ఉత్పత్తి రంగంలో సగం వరకు న్యూ సౌత్‌వేల్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ సుమారు 600కు పైగా తేనెటీగల పరిశ్రమలకు ఉన్నాయి. సుమారు 60 లక్షల మేర తేనెటీగలు పెంచుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరోవా కీటకాల రాకతో తేనెటీగలు వైరస్‌ బారిన పడి చనిపోతున్నాయి. తేనె పట్టులకు కూడా వైరస్‌ సోకి ఉంటుందని అక్కడి వ్యాపారులు నిప్పు పెడుతున్నారు. వరోవా కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో నష్టపోయామని ఈసారి వరోవా కీటకాల రాకతో తమకు అప్పులే మిగులుతాయని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తేనె ఉత్పత్తుల వ్యాపారులు కోరుతున్నారు.

తేనెటీగలను రక్షించుకునేందుకు అస్ట్రేలియా ప్రభుత్వం తేనెటీగల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. వరోవా కీటకాలను గుర్తించిన చోట తేనెటీగలను ఆస్ట్రేలియా ప్రభుత్వం చంపేస్తోంది. తేనె ఉత్పత్తుల పరిశ్రమను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories