బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల హత్యలు: తాజాగా తుపాకీతో కాల్చి చంపిన సహోద్యోగి!

బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల హత్యలు: తాజాగా తుపాకీతో కాల్చి చంపిన సహోద్యోగి!
x
Highlights

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గమైన హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గమైన హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. దీపూ చంద్ర దాస్‌, అమృత్‌ మండల్‌ అనే హిందూ యువకుల హత్యలు మరువక ముందే, మయమన్‌సింగ్‌ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది.

మయమన్‌సింగ్‌ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బజేంద్ర బిశ్వాస్ (42) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సహోద్యోగి నోమన్ మియా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఫ్యాక్టరీ బారక్‌లో తామిద్దరం సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో, సరదాకే తుపాకీని బిశ్వాస్‌పై గురిపెట్టానని నిందితుడు చెబుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ట్రిగర్ నొక్కడంతో బుల్లెట్ బిశ్వాస్ శరీరంలోకి దూసుకెళ్లిందని నోమన్ మియా పేర్కొన్నాడు.

తీవ్ర గాయాలైన బిశ్వాస్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు నిందితుడు నోమన్ మియాను అరెస్టు చేసి, ఇది నిజంగా ప్రమాదమా లేక పథకం ప్రకారం చేసిన హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆందోళనలో హిందూ సమాజం

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు అక్కడి హిందువులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల ఈ యువకుడిని అల్లరిమూకలు అకారణంగా దాడి చేసి చంపేశాయి. రాజ్‌బరి జిల్లాలో గ్రామస్థులు ఈ యువకుడిని కొట్టి చంపిన ఘటన మర్చిపోకముందే బిశ్వాస్ హత్య జరిగింది. వరుసగా హిందూ వ్యక్తులే లక్ష్యంగా దాడులు మరియు మరణాలు సంభవిస్తుండటంతో అంతర్జాతీయ సమాజంలోనూ బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రతపై చర్చ మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories