China: చైనాలో మరో కోవిడ్‌ వేవ్‌?.. వైరస్‌ కట్టడిపై చేతులెత్తేసిన చైనా ప్రభుత్వం

Another Covid Wave In China
x

China: చైనాలో మరో కోవిడ్‌ వేవ్‌?

Highlights

China: వైరస్‌ కట్టడిపై చేతులెత్తేసిన చైనా ప్రభుత్వం

China: రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చైనాలోని జిన్‌పింగ్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది. రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయో ట్రాక్‌ చేయడం అసాధ్యమంటూ ఆరోగ్యశాఖ ప్రటించింది. ఇప్పుడు చైనాలో ఎంత మంది వైరస్‌ బారిన పడ్డారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రజల ఆరోగ్యాన్ని జిన్‌పింగ్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆందోళనలు చేసిన ప్రజలకు తగిన శాస్తి జరగాలన్న రీతిలో వ్యవహరిస్తోంది. తాజాగా 11వేల కేసులు నమోదైనట్టు చైనా ప్రకటించినా కేసులు లక్ష మేర ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడి పరిస్థితులను చూస్తుంటే చైనాలో మరో వేవ్‌ వచ్చిందా? అన్నట్టుగా మారాయి ఇన్ఫెక్షన్ల రేటు రాకెట్లను తలపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చైనాలో మహహ్మారి కరోనా విలయతాండవం ఆడుతోంది. మరో వేవ్‌ ముప్పు పొంచి ఉందా? అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అందకుముందు కేవలం 2వేల 300 కేసులే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు కానీ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఎవరూ కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదు. కోవిడ్‌ ఆంక్షలను సడలించడంతో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా వేలాది మందికి వైరస్‌ సోకుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వైరస్ సోకి లక్షణాలు లేని వారిని పరిగణలోకి తీసుకోమని చైనా ప్రభుత్వం వెల్లడించింది. అయితే కొత్త కేసుల్లో అసింప్టమేటిక్‌ కేసులే ఎక్కువగా ఉన్నాయి. లక్షణాలున్న కేసులు వందల్లోనే చూపుతున్నారు. మరోవైపు కొత్త కేసులను ట్రాక్‌ చేయడం అసాధ్యమంటూ చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వైరస్‌ మరింత విజృంభిస్తుందని ప్రజలు భయపడుతున్నారు. పలువురు స్వచ్ఛందంగానే దుకాణాలను మూసేస్తున్నారు. చైనాలోని ప్రధాన నగరాలన్నీ నిర్మాణుష్యంగానే కనిపిస్తున్నాయి. పలు నగరాల్లో దుకాణాలు మూసివేసినా ప్రజలు మాత్రం సంచరిస్తున్నారు. అయితే ప్రతిక్కరూ మాస్క్‌ ధరిస్తున్నారు. ఆంక్షలు సడలించిన తరువాత కోవిడ్‌ మరణాలు లేకపోవడం చైనీయులకు ఊరటనిస్తోంది. అయితే చైనీయుల తీరుతో డ్రాగన్‌ దేశంలో మరో కొత్త వేవ్‌ రానున్నదా? అనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ కట్టడి విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో ఆసుపత్రులన్నీ వైరస్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవేళ కేసులు పెరిగితే మాత్రం ఆసుపత్రులకు జనాలు పోటెత్తే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. అత్యధికులు వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను నిలిపేస్తున్నారు. కోవిడ్‌ బాధితులకు వైద్యులు సేవలను అందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భారీగా వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు. కొత్తగా ఐసీయూ బెడ్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో కొత్తగా వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో వైరస్‌ బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. మరోవైపు జిన్‌పింగ్‌ ప్రభుత్వం కొత్త కేసులు విషయంలో పట్టించుకోవడం లేదు. ప్రజలను వారి అదృష్టానికి వదిలేసింది. ఫలితంగా మరో వైవ్‌ వస్తుందన్న భయం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అతలాకుతలమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ మరింత క్రుంగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు జీరో కోవిడ్‌ పాలసీతో కుదేలయ్యాయి. ప్రయాణ ఆంక్షలు విధించడంతో చైనా విమానయాన సంస్థలు రెండేళ్లుగా సతమతమవుతున్నాయి. చైనా వ్యాప్తంగా 50 విమానయాన సంస్థలు ఉన్నాయి. వాటిలో చైనా సౌతర్న్‌ ఎయిర్‌లైన్స్, ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌ అతి పెద్దవి. ఆంక్షల కారణంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ లేక ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మొదటి ఆరు నెల్లలోనే ఎయిర్‌ చైనా సంస్థ 280 కోట్లు, చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌ 270 కోట్లు, చైనా సౌతర్న్‌ ఎయిర్‌లైన్స్‌ 170 కోట్ల డాలర్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. 2020లో కోవిడ్‌ సోకడం ప్రారంభమైన తరువాత ఈ మూడు సంస్థలు ఏఖంగా 2వేల 180 కోట్ల డాలర్లు నష్టపోయాయి.

మొత్తంగా జీరో కోవిడ్‌ పాలసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆంక్షలను సడలించడంతో రవాణా రంగం ఊపందుకుని ప్రజలు ప్రయాణాలను చేపడుతారని అంతటా భావిస్తున్నారు. దేశీయ విమానాయానానికి మాత్రం ప్రయాణికులు పెరుగుతున్నారు. నవంబరు తరువాత.. 22 శాతం ప్రయాణికులు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో వేలాది దేశీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇది ఎన్నాళ్లు ఇలా ఉంటుందోనని విమానయాన సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు కారణం రోజు రోజుకు పెరుగుతున్న ఇన్ఫెక్షనే. చైనా ఆసుపత్రుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. కేసుల భారీగా పెరుగుతున్న ఈ క్యూలే చెబుతున్నాయి. మరోవైపు జలుబు చేసినా దగ్గు వచ్చినా ప్రజలకు మెడికల్‌ షాపులకు పరుగులు పెడుతున్నారు. జనాలు భారీగా పోటెత్తడంతో మందులు వెనువెంటనే అయిపోతున్నాయి. దీంతో పలు మెడికల్‌ షాపులు మందులు కొరతతో మూతపడుతున్నాయి. సొంతంగా కరోనాను నిర్దారించే కిట్లు కూడా నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తిరిగి విధుల్లోకి రావాలంటూ పలు కంపెనీలు కోరుతున్నాయి. కంపెనీల విన్నపాలను ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లను యజమానులు మూసేస్తున్నారు. మరోవైపు విమానయానానికి కొందరు ఆసక్తి చూపుతున్నా రోడ్డు రవాణా మాత్రం పూర్తిగా నిలిచిపోయింది. వైరస్‌ సోకుతుందన్న భయంతోనే ప్రజా రవాణాకు చైనీయులు మొగ్గుచూపడం లేదు.

ఇటీవల జీరో కోవిడ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోనలు చేశారు. జిన్‌పింగ్‌ దిగిపో అంటూ నినదించారు. జైలు శిక్షలు తప్పవని తెలిసినా రోడ్లెక్కి అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా ప్రభుత్వ పాలన, విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆందోళనలపై జిన్‌పింగ్‌ ఉక్కుపాదం మోపారు. బీజింగ్‌, షాంఘై ప్రావిన్స్‌ల వ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు. ప్రజలు ఆందోళనలు చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినా ప్రజలు మాత్రం శాంతించలేదు. తియనాన్మెన్‌ స్క్వేర్‌ తరహాలో ఆందోళనలు ఊపందుకున్నాయి. 1989 తియనాన్మెన్‌ స్క్వేర్‌ విప్లవం తరువాత ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలను కమ్యూనిస్టులు చూడలేదు. ప్రజాగ్రహానికి కమ్యూనిస్టులు షేక్‌ అయ్యారు. వెంటనే స్పందించ కోవిడ్‌ నిబంధనలను సడలించింది. అది కూడా భారీగా కేసులు నమోదవుతున్న సమయంలో జీరో కోవిడ్‌ ఆంక్షలను జిన్‌పింగ్‌ ప్రభుత్వం తొలగించింది. నిజానికి జీరో కోవిడ్‌పై ప్రజలు భయాందోళన నెలకొన్నది. ఒమిక్రాన్‌ వైరస్‌ ఒకరికి సోకితే ఆ వ్యక్తి నుంచి 18 మందికి వ్యాపించే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన స్వల్పకాలంలోనే కేసులు వేల సంఖ్యలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసేశారు. దీంతో పలు నగరాలు నిర్మాణుష్యంగా మారుతున్నాయి.

ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ ఇళ్లకే పరిమతమవుతున్నారు. కరోనా భయంతో బయటి రావడానికి పలువురు జంకుతున్నారు. మరోవైపు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం ప్రజల ఇష్టమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కోవిడ్‌ పరీక్షలకు కొందరు ముందుకువస్తున్నా అత్యధికులు మాత్రం దూరంగా ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories