తప్పు చేస్తే రాజుకైనా జైలు తప్పదు.. బ్రిటన్ కింగ్ సోదరుడు ఆండ్రూ అరెస్ట్..

Britain king brother Andrew mountbatten windsor arrested
x

బ్రిటన్ కింగ్ సోదరుడు ఆండ్రూ ను పోలీసులు అరెస్ట్ చేశారు 

Highlights

అమెరికాకు చెందిన లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు ఉందని వెల్లడైన నేపథ్యంలో బ్రిటన్ రాజు సోదరుడు ఆండ్రూ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మన దేశంలో ఏదైనా పదవిలో ఉంటే.. తప్పులు చేసినట్టు రుజువైనా అరెస్ట్ చేయాలంటే బోలెడు ప్రొసీజర్. అసలు అధికారం అనుభవించిన వారిని అరెస్ట్ చేయడం అనేదే చాలా అరుదుగా జరిగే సంఘటన. కానీ, చాలా దేశాల్లో తప్పు చేసినట్టు బలమైన ఆరోపణలు వస్తే రాజునైనా వదిలిపెట్టరు. వారి చట్టాల ముందు రాజు, పేద తేడా ఉండదు. ఇదిగో దీనిని నిరూపించే సంఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది.

బ్రిటన్‌లో, కింగ్ చార్లెస్ సోదరుడు ఆండ్రూ ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడనే అనుమానంతో అరెస్టు చేశారని బీబీసీ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. . BBC రిపోర్ట్ ప్రకారం, గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సాండ్రింగ్‌హామ్‌లోని అతని ఇంట్లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆండ్రూ పుట్టినరోజు కూడా కావడం గమనించదగ్గ విషయం.

అసలేం జరిగింది..

ఎప్స్టీన్ కేసులో బాధితురాలైన వర్జీనియా గియుఫ్రే, 2001లో తనకు 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. అయితే, గ్రిఫీ ఆరోపణలన్నింటినీ ఆండ్రూ ఖండించారు. గియుఫ్రే ఏప్రిల్ 2025లో మరణించింది. ఆమె మరణం ఆత్మహత్యగా నిర్ధారించడం జరిగింది. ఆ ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా చేశారు అక్కడి అధికారులు.

ఆండ్రూకు జీవిత ఖైదు పడే ఛాన్స్..

ఇంగ్లాండ్‌లో, ప్రభుత్వ కార్యాలయంలో దుష్ప్రవర్తన తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పు చేసినట్లు తెలిసినా, దానిని కొనసాగించాడని రుజువు అవసరం. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికీ గరిష్ట శిక్ష జీవిత ఖైదు. ఈ కేసులో వచ్చిన ఆరోపణలు ఆండ్రూ బ్రిటన్ వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో జరిగినట్టు భావిస్తున్నారు. ఆయన 2001లో ఆ పదవికి నియమితులయ్యారు కానీ 10 సంవత్సరాల తర్వాత రాజీనామా చేశారు. అమెరికన్ నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆయన పేరు బయటకు రావడంతో అప్పట్లో ఆయన రాజీనామా చేశారు. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఆండ్రూ అధికార పదవిలో ఉన్నపుడు ఎప్స్టీన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాయి.

ఆండ్రూ రాజ బిరుదుల తొలగింపు..

గత ఏడాది అక్టోబర్‌లో చార్లెస్ రాజు తన తమ్ముడు ఆండ్రూ నుండి యువరాజు బిరుదును, అన్ని రాజ బిరుదులను తొలగించారు. అలాగే విండ్సర్‌లోని ఆయన నివాసం రాయల్ లాడ్జ్‌ను కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు. 65 ఏళ్ల ఆయనకు ఉన్న డ్యూక్ ఆఫ్ యార్క్" అనే బిరుదును ఉపయోగించకుండా నిషేధం విధించారు. తన రాజ బిరుదులను తొలగించిన తర్వాత, ప్రిన్స్ ఆండ్రూను ఇప్పుడు "ఆండ్రూ మౌంట్ బాటన్-విండ్సర్" అని పిలుస్తున్నారు.

ఆండ్రూ పై ఆరోపణలు ఇవే.. .

దివంగత క్వీన్ ఎలిజబెత్ రెండవ కుమారుడు ఆండ్రూ (65), చాలా కాలంగా అమెరికా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. వర్జీనియా గియుఫ్రే అనే మహిళ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆండ్రూ ఆరోపణల్లో చిక్కుకున్నారు.

2011లో వర్జీనియా గియుఫ్రే అమెరికాలోని ఒక హై ప్రొఫైల్ వ్యభిచార ముఠాను బయటపెట్టి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, అక్రమ రవాణాను ఆమె వెల్లడించింది. తనకు కేవలం 15 సంవత్సరాల వయసు ఉన్నపుడు ఎప్స్టీన్ నెట్‌వర్క్‌లో చిక్కుకున్నానని ఆమె చెప్పింది. ఆమె అనేక మంది ప్రభావవంతమైన ఉన్నత స్థాయి వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవలసి వచ్చింది. అదే ఇంటర్వ్యూలో, వర్జీనియా బ్రిటన్ యువరాజు ఆండ్రూతో తనకు జరిగిన అనుభవాలను కూడా ప్రస్తావించింది.

వర్జీనియా గియుఫ్రే చాలా సంవత్సరాలు ఆస్ట్రేలియాలో నివసించి లైంగిక వేధింపులకు గురైన మహిళలకు న్యాయవాదిగా మారింది. గత సంవత్సరం అక్టోబర్ 21న, వర్జీనియా గియుఫ్రే జ్ఞాపకాల పుస్తకం "నో బాడీస్ గర్ల్" ప్రచురితమైంది. ఆ పుస్తకంలో ఆండ్రూ గురించి సంచలన విషయాలున్నాయి. అవి ఇవే..

  • 2001లో ఆండ్రూను మొదటిసారి కలిసినప్పుడు వర్జీనియా వయసు కేవలం 17 సంవత్సరాలు. వారు రెండవసారి కలిసినప్పుడు ఆమె ఇంకా మైనర్. ఆమె ఆండ్రూను మొదటిసారి కలవబోతున్నప్పుడు, ఎప్స్టీన్ స్నేహితురాలు గిస్లైన్ ఆమెతో, 'సిండ్రెల్లా, నువ్వు ఒక అందమైన యువరాజును కలవబోతున్నావు' అని చెప్పింది. వర్జీనియాను చూడగానే ఆండ్రూ ఆమె వయస్సును ఊహించాడు. "నీకు 17 ఏళ్లు, నా కూతుళ్లు నీకంటే కొంచెం చిన్నవాళ్ళు" అని అన్నాడు.
  • ఆండ్రూ వర్జీనియాతో మూడుసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడు: మొదట లండన్‌లోని గిస్లైన్ మాక్స్‌వెల్ ఇంట్లో, రెండవది న్యూయార్క్‌లోని ఎప్స్టీన్ భవనంలో - మూడవది ఎప్స్టీన్ కరేబియన్ ద్వీపంలో.
  • వర్జీనియా ఆండ్రూతో మూడవసారి లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు, మరో ఎనిమిది మంది మైనర్ బాలికలు అక్కడ ఉన్నారని రాసింది. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం తన జన్మహక్కు అని ప్రిన్స్ ఆండ్రూ భావించాడని గ్రిఫీ చెప్పింది.
Show Full Article
Print Article
Next Story
More Stories