Epstein Files Leak: బిల్ గేట్స్, ఎలోన్ మస్క్ చీకటి సంభాషణలు బట్టబయలు

Epstein Files Leak: జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన తాజా ఫైళ్లు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Naresh.k
Published on: 6 Feb 2026 6:47 PM IST
Epstein Files Leak
X

Epstein Files Leak: బిల్ గేట్స్, ఎలోన్ మస్క్ చీకటి సంభాషణలు బట్టబయలు

Epstein Files Leak: జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన తాజా ఫైళ్లు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు 1.8 లక్షల ఫోటోలు, 35 లక్షల ఫైళ్లు బయటకు రావడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. అయితే, ఇంత భారీ డేటాలో మనకు కావాల్సిన సమాచారాన్ని వెతకడం సామాన్యులకు అసాధ్యం. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఒక గుర్తుతెలియని నెటిజన్ సృష్టించిన వెబ్‌సైట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఎప్స్టీన్ వ్యక్తిగత ఈమెయిల్ ఇన్‌బాక్స్‌ను హూబహూ జీమెయిల్ (Gmail) లాగే డిజైన్ చేసి 'JMail' పేరుతో ఒక సైట్‌ను రూపొందించారు. ఇందులో ఎలోన్ మస్క్, బిల్ గేట్స్, నోమ్ చోమ్స్కీ వంటి ప్రముఖులతో ఎప్స్టీన్ జరిపిన సంభాషణలు టైమ్ స్టాంపులతో సహా అందుబాటులో ఉన్నాయి. ఎవరితో ఎప్పుడు మాట్లాడారు? ఏయే డీల్స్ కుదుర్చుకున్నారు? అనే విషయాలను ఎవరైనా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. విశేషమేమిటంటే, ఇందులో ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు 'జెమిని' అనే చాట్‌బాట్ కూడా ఉంది.

ఈ నెట్‌వర్క్ కేవలం ఈమెయిల్స్‌కే పరిమితం కాలేదు.ఇందులో ఎప్స్టీన్ సేకరించిన వేల కొద్దీ ఫోటోలు ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్నారులకు సంబంధించిన కలవరపెట్టే చిత్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన అన్ని డాక్యుమెంట్లు ఇందులో భద్రపరిచారు.ఎప్స్టీన్ ప్రైవేట్ విమాన ప్రయాణాల వివరాలు ఇందులో ఉన్నాయి. అమెరికా నుండి ఎప్స్టీన్ దీవుల వరకు అతను ఎక్కడెక్కడ తిరిగాడో ఈ ఫ్లైట్ లాగ్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఇవే కాకుండా, ఎప్స్టీన్ ఫేస్‌బుక్ లాంటి 'Jacebook', అమెజాన్ ఆర్డర్ల కోసం 'Jamazon' వంటి సైట్లు కూడా సృష్టించబడ్డాయి. ప్రపంచ ధనవంతులు, రాజకీయ నాయకుల చీకటి కోణాలను బయటపెడుతున్న ఈ ఫైల్స్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దావానంలా వ్యాపిస్తోంది.

Naresh.k

Naresh.k

Next Story