కరోనా వైరస్ కు మరో వైరస్ తోనే చెక్ అంటున్న అమెరికా శాస్త్రవేత్తలు!

కరోనా వైరస్ కు మరో వైరస్ తోనే చెక్ అంటున్న అమెరికా శాస్త్రవేత్తలు!
x
Highlights

ప్రపంచం ఎదుర్కొంటోన్న కరోనా సవాల్ కు తాము చెక్ పెడతామంటూ చెబుతోంది అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రో బయాలజీ. ముల్లును ముల్లుతోనే తీయాలన్న విధంగా ఈ కొవిడ్...

ప్రపంచం ఎదుర్కొంటోన్న కరోనా సవాల్ కు తాము చెక్ పెడతామంటూ చెబుతోంది అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రో బయాలజీ. ముల్లును ముల్లుతోనే తీయాలన్న విధంగా ఈ కొవిడ్ వైరస్ కు వైరస్ తోనే సమాధానం చెప్పాలంటోంది. ఇప్పటికే కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఈ సంస్థ ప్రయోగాత్మక పరీక్షలకు సిద్ధమవుతోంది. కరోనా ధాటికి ప్రపంచం విలవిలలాడుతోన్న పరిస్థితుల్లో అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రో బయాలజీ వెల్లడించిన విషయాలు ఉపశమనం కలిగిస్తున్నాయి.

కరోనా అంతమే లక్ష్యం - ఒక్క కంపెనీ కాదు.. ఒక్క దేశం కాదు.. అన్ని దేశాలదీ టార్గెట్ - భయానక వైరస్‌ని అంతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నాలు. చైనాలోని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ తో పాటు అమెరికన్ డిస్ట్రిబ్యూటెడ్‌ బయో' ల్యాబ్‌, ఇనోవియా ఫార్మాస్యూటికల్స్ లాంటి ఎన్నో సంస్థలు కరోనాకు మందు కనిపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ కూడా వేక్సిన్ కనిపెట్టే పరిశోధనలను కొనసాగిస్తోంది.

కరోనాకు వేక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుపుతోన్న ఎన్నో సంస్థలు తమ ప్రయోగాల్లో పురోగతి సాధించినట్లు తెలిపాయి. కానీ ఆ వాక్సిన్ ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుంది..? అది పూర్తిగా కరోనాను అంతం చేస్తుందా..? అనే ప్రశ్నలకు మాత్రం కచ్చితమైన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రో బయాలజీ.

అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రో బయాలజీ పరిశోధనల పురోగతిని ఎంబయో అనే జర్నల్ ప్రచురించటంతో టీకా కనుగొనడంపై ఆశలు చిగురించాయి. ఈ ప్రచురణల ప్రకారం మెర్స్ పై పరిశోధనలు చేస్తోన్న పరిశోధకుల బృందం ఓ టీకాపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మెర్స్ సోకకుండా అడ్డుకునే టీకానే కరోనా నివారణకూ ఉపయోగపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు. కుక్కల్లో కెన్నెల్ కాఫ్ కు కారణమయ్యే పారా ఇన్ ఫ్లుయంజా వైరస్ 5 ను ఉపయోగించి ఈ టీకాను కనిపెట్టినట్లు తెలిపారు.

'పీఐవీ 5' వైరస్ మనుషుల పై ఎలాంటి ప్రభావం చూపదన్న శాస్త్రవేత్తలు ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించారు. 'పీఐవీ 5' వైరస్ లో జన్యు పరమైన మార్పులు చేసిన పరిశోధకులు ఎస్ ప్రొటీన్ ను ఉత్పత్తి చేసి ఒక బ్యాచ్ ఎలుకలపై ప్రయోగించారు. ఆ తర్వాత మరో బ్యాచ్ కు ఎలాంటి మార్పులు చేయని 'పీఐవీ 5' వైరస్ ను ప్రయోగించారు. ఆ తర్వాత ఎలుకలు మెర్స్ వైరస్ ప్రభావానికి గురయ్యేలా చేయగా జన్యుపరమైన మార్పులు చేసి 'పీఐవీ 5' ఇచ్చిన ఎలుకలు వైరస్ ను తట్టుకున్నాయని తెలిపారు. ఎలాంటి మార్పులు చేయని వైరస్ ఇచ్చిన ఎలుకలు మృతి చెందాయన్నారు. మెర్స్ పై ప్రభావం చూపిన మోడల్ నే కొవిడ్ 19పై ప్రయోగిస్తే ఫలితం వస్తుందంటున్నారు అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రో బయాలజీ పరిశోధకుల బృందం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories