America: అమెరికా పౌరులారా.. వెంటనే రష్యాను వీడండి!

America Warns Citizens to Leave Russia
x

America: అమెరికా పౌరులారా.. వెంటనే రష్యాను వీడండి!

Highlights

America: మాస్కోలోని అమెరికా ఎంబసీ ఆదేశాలు

America: ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాదికి చేరువ అవుతోంది. దీంతో ఐరోపా, అమెరికా దేశాల్లో టెన్షన్‌ మొదలయ్యింది. ఫిబ్రవరి 24లోగా మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దండెత్తే ముప్పు ఉందన్న ఆందోళనలు వెల్లువెతుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా అమెరికా స్పందించింది. అమెరికన్లు వెంటనే రష్యాను వీడాలంటూ మాస్కోలోని అగ్రదేశ రాయబార కార్యాలయం పదే పదే హెచ్చరించింది. తప్పుడు నిర్బంధాలతో అరెస్టులు చేసే అవకాశం ఉందని.. వెంటనే రష్యా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. 3 లక్షల సైన్యాన్ని సమీకరిస్తున్నట్టు సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. అప్పట్లో మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం ఇలాంటి హెచ్చరిక చేసింది. ఐదు నెలల తరువాత మళ్లీ బహిరంగ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

గూఢచర్యం కింద అమెరికా పౌరులను రష్యన్‌ భద్రతా దళాలు అరెస్టు చేసి.. రహస్య నిర్బంధించే అవకాశం ఉందని ఎంబసీ తెలిపింది. అరెస్టు చేసిన తరువాత.. పారదర్శకమైన న్యాయం, చికిత్స అందించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా.. దోషులుగా నిర్ధారించి.. సాక్ష్యాలను సమర్పించకుండా చేస్తాయని ఎంబసీ హెచ్చరించింది. రష్యన్‌ అధికారులు ఏక పక్షంగా చట్టాలను అమలు చేస్తున్నారని.. అప్రమత్తమై.. వెంటనే దేశం విడిచి వెళ్లాలని రాయబార కార్యాలయం తెలిపింది. జనవరిలో గూఢచర్యం చేస్తున్నట్టు అనుమానించి.. అమెరికాకు చెందిన ఓ పౌరుడిని రష్యకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ జనవరిలో అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మరింత మంది అమెరికన్లను రష్యా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే మాస్కోలోని రాయబార కార్యాలయం స్పందించి.. పౌరులకు పిలుపునిచ్చింది.

ఉక్రెయిన్ యుద్ధం ఈనెల 24తో ఏడాదికి చేరుకోనున్నది. దీంతో మరోసారి ఐరోపా, అమెరికా దేశాల్లో టెన్షన్ మొదలైంది. పుతిన్‌ పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌పై దాడికి దిగుతారనే భయం వారిని వెంటాడుతోంది. ఏడాదైనా యుద్ధం విషయంలో పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. పైగా తమ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. ఒకవైపు ఉక్రెయిన్‌ నగరాలపై బీకర దాడులు చేస్తూనే.. మరోవైపు చర్చలకు సిద్ధమని క్రెమ్లిన్‌ ప్రకటిస్తోంది. ఈ యుద్ధం కారణంగా.. ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసమైంది. సైనిక నష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆయుధాలను పేల్చేస్తోంది. ఇక రష్యాకు భారీ సైనిక, ఆయుధ నష్టం వాటిల్లింది. పశ్చాత్య దేశాల నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మొత్తం 2లక్షల మేర మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అయినా యుద్ధం విషయంలో పుతిన్ మొండిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పాశ్చాత్య దేశాలు భారీ ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేస్తున్నాయి. దీంతో యుద్ధం ఎప్పుడు ఆగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories