ప్రపంచంలో కొవిడ్ మరణాల్లో అమెరికాలో నాలుగోవంతు

ప్రపంచంలో కొవిడ్ మరణాల్లో అమెరికాలో నాలుగోవంతు
x
Highlights

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో జడలు విప్పింది. అమెరికాలో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. అగ్ర రాజ్యంలో శుక్రవారం మరో 2,143 మరణాలు...

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో జడలు విప్పింది. అమెరికాలో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. అగ్ర రాజ్యంలో శుక్రవారం మరో 2,143 మరణాలు నమోదయ్యాయి.

అగ్రరాజ్యం కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. రోజుకు రోజుకు మరణాల సంఖ్య రెట్టింపవుతోంది. ఫిబ్రవరి 29న అధికారికంగా తొలి మృతి రికార్డులకెక్కిన అమెరికాలో కేవలం 55 రోజుల్లో అర లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి వరకు అమెరికాలో చోటుచేసుకున్న మరణాలు 5,151 మాత్రమే. కానీ, ఏప్రిల్‌లో వైరస్‌ విజృంభణతో ఈ 24 రోజుల్లోనే 46 వేల మంది బలయ్యారు. సగటున దాదాపు రోజుకు 2 వేల మంది చనిపోయారు.

మరోవైపు ఆ దేశంలో ఫిబ్రవరి 15న తొలి పాజిటివ్‌ కేసును గుర్తించారు. 69 రోజుల అనంతరం శుక్రవారం నాటికి ఆ సంఖ్య 9 లక్షలు దాటింది. ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ అమెరికాలో రోజుకు సగటున 2 వేల మంది చొప్పున కరోనాకు బలయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 24 నాటికి అమెరికాలో 52,690 కేసులు నమోదు కాగా 681 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 14న అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా మరణాల సంఖ్య 25 వేలు దాటింది.

ఏప్రిల్ 23 నాటికి ఒక్క న్యూయార్క్ స్టేట్‌లోనే 2లక్షల 63వేల మంది కోవిడ్ బారిన పడగా 15,740 మంది చనిపోయారు. న్యూజెర్సీలో లక్ష కరోనా కేసులను గుర్తించగా 5368 మంది చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల తర్వాత మసాచూసెట్స్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ పది రోజుల్లో దాదాపు 3 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌ల్లో మరణించిన వారినే పరిగణనలోకి తీసుకున్నారని.. ఇళ్ల వద్ద చనిపోయిన వారిని కూడా కలిపితే మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories