ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఆరోగ్యశాఖ మంత్రి పై వేటుకు రంగం సిద్ధం

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఆరోగ్యశాఖ మంత్రి పై వేటుకు రంగం సిద్ధం
x
Donald Trump (File Photo)
Highlights

అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు కుదేలవుతోంది. మరేదేశానికి సాధ్యం కాని రీతిలో అక్కడ కేసులు ఏకంగా 10 లక్షలు దాటింది.

అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు కుదేలవుతోంది. మరేదేశానికి సాధ్యం కాని రీతిలో అక్కడ కేసులు ఏకంగా 10 లక్షలు దాటింది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగుతున్నా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నారు. మరోవైపు ఆరోగ్యమంత్రి అలెక్స్‌పై వేటు వేస్తారనే ప్రచారం ఊపందుకుంది.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ ఏకంగా కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. నిత్యం వేలాదిగా జనం కరోనా బారిన పడుతున్నారు. గత కొన్నిరోజులుగా ఆ దేశంలో వైరస్‌ దెబ్బకు కనీసం రెండున్నర వేల నుంచి 3 వేల మంది వరకు బలవుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 55 వేలు దాటింది.

ఓ వైపు వైరస్ ఉధృతి కొనసాగుతున్నా అమెరికాలోని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలను ఈ వారంలో పాక్షికంగా ఎత్తివేయాలని నిర్ణయించారు. టెన్నెస్సీలో ఇవాళ్టి నుంచి రెస్టారెంట్లు కూడా తెరుచుకోనున్నాయని అధికారులు వెల్లడించారు. మిస్సౌరీలో ఈ వారం దాదాపుగా అన్ని వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇడహోలో ప్రార్థనా స్థలాల్లోకి ప్రజలను అనుమతించనున్నారు. అంతేకాకుండా జార్జియా, ఒక్లహామా రాష్ట్రాల్లో సెలూన్లు, స్పాలను తెరిచేందుకు అనుమతించారు. అలస్కాలోనూ రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి.

ఇప్పటికే అమెరికాలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని సాధారణ జనజీవనం కనిపిస్తోంది. రిపబ్లికన్‌ గవర్నర్ల నేతృత్వంలోని రాష్ట్రాలైతే కీలక రంగాలను పునరుద్ధరించేందుకు అడుగులు వేస్తుండగా డెమోక్రాటిక్‌ గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న ఆర్థికరాజధాని న్యూయార్క్‌లో ప్రస్తుతానికి ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు. హవాయిలో లాక్ డౌన్ వచ్చే నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి గవర్నర్‌ ప్రకటించారు.

అమెరికా ఆరోగ్య మంత్రి అలెక్స్‌ అజర్‌పై వేటు వేయాలని ట్రంప్‌ సర్కార్ యోచిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అలెక్స్‌ విఫలమయ్యారని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories